ఎక్స్‌యూవీ500ని కొనటానికి 13 కారణాలు - పార్ట్ 5
11. అత్యాధునిక భద్రతా ఫీచర్లు:
మహీంద్రా ఎక్స్‌యూవీ500 పూర్తిగా అత్యాధునికమైన భద్రతా ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో 'రోల్ఓవర్ మిటిగేషన్' ప్రమాదకర డ్రైవింగ్ పరిస్థితులను గుర్తించి, సదరు పరిస్థితి ప్రమాదకరం కాకమునుపే అప్రమత్తమై, ఈఎస్‌పిని యాక్టివేట్ చేస్తుంది. ఇలా యాక్టివేట్ అయిన ఈఎస్‌పి వాహన వేగాన్ని నియంత్రించటం ద్వారా వాహనాన్ని స్థిరత్వానికి తీసుకువచ్చి ప్రమాదాల బారి నుండి తప్పిస్తుంది. ఇందులో ఉండే ఆరు ఎయిర్‌బ్యాగ్స్ (డ్రైవర్, ప్యాసింజర్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్) లోపలి ఉండే వ్యక్తులకు అన్నివైపుల రక్షణ కల్పిస్తాయి. వాహన బాడీలో ఉండే సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ కారణంగా ఈ వాహనాన్ని మరొక వాహనం వచ్చి గుద్దినప్పుడు ఏర్పడే శక్తి కేవలం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా బాడీ మొత్తానికి బదిలీ అయ్యేలా చేసి ప్రమాద నష్టాన్ని తగ్గిస్తుంది.
12. లెథర్‌తో కప్పబడిన లోపలి భాగం:
ఒక్కసారి మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలోనికి అడుగుపెడితే, సర్గంలో ఉన్నట్లు అనుభూతిని పొందటం ఖాయం. ఇందులో హై క్వాలటీ లెథర్‌తో చేయబడిన ఇంటీరియర్స్ మంచి విలాసవంతమైన, సౌకర్యవంతమైన అనుభూతిని కల్పిస్తాయి. సీట్లు, స్టీరింగ్ వీల్ వంటి ఇతర స్పృశించే వస్తువులు / ప్రాంతాలను స్వచ్ఛమైన లెథర్‌తో కవర్ చేయబడి ఉంటాయి. వాహనం లోపల ఏసి (ఎయిర్ కండిషనింగ్) ప్రతి వరుసలోని సీట్లలో ఉండే ప్యాసింజర్లకు కూడా వ్యాపించేలా డిజైన్ చేయబడిన ఏసి వెంట్స్ (రంధ్రాలు), మనసుకు ఉల్లాసాన్ని కలిగించే ఇంటీరియర్ లైటింగ్, డ్రైవర్ ఎత్తుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన 8-వే అడ్జస్టబల్ సీట్. అవసరం లేదనుకున్నప్పుడు వెనుక రెండు వరుసలలో ఉన్న సీట్లను పూర్తిగా మడిచిపెట్టి, లగేజ్ స్పేస్ కోసం వాడుకోవచ్చు.
13. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి)
భద్రతా ఫీచర్లలో కెల్లా ఈఎస్‌పి అత్యాధునికమైనది. ఇది కారు యొక్క దిశా నిర్ధేశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎల్లప్పుడూ హైఅలెర్ట్‌తో పనిచేస్తుంది. ఒకవేళ వాహనం కంట్రోల్ తప్పినట్లు ఈఎస్‌పి గుర్తిస్తే, ఇది ఆటోమేటిక్‌గా బ్రేక్‌లను అప్లయ్ చేసి, సంబంధిత చక్రంలోని టార్క్‌ను తగ్గించి వాహనం కంట్రోల్‌లోకి వచ్చేలా చేస్తుంది.
ఇన్ని విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి కాబట్టే.. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి మార్కెట్లో అంత క్రేజ్ మరియు డిమాండ్. అంతేకాకుండా, దీని సరమైన ధర కూడా మహీంద్రా ఎక్స్‌యూవీ500 విజయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆకర్షనీమైన ధరలో ప్రపంచ స్థాయి ఫీచర్లతో లభిస్తున్న మేడ్ ఇన్ ఇండియా ఎస్‌యూవీ కాబట్టే, కొనుగోలుదారులు మహీంద్రా ఎక్స్‌యూవీ500 కోసం నెలల తరబడి సైతం వేచి చూసేందుకు సిద్ధంగా ఉన్నారే తప్ప వేరొక ఎస్‌యూవీని కొనుగోలు చేసేందుకు ఇష్టపడటం లేదు.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధరలు:
* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ 6 (ఫ్రంట్-వీల్ డ్రైవ్) - రూ.11,58,472
* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ 8 (ఫ్రంట్-వీల్ డ్రైవ్) - రూ.13,03,970
* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ 8 (ఆల్-వీల్ డ్రైవ్) - రూ.14,10,904


Click it and Unblock the Notifications









