కొత్త చెవర్లే కాప్టివా ఎస్‌యూవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలు

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సరికొత్త అప్‌గ్రేడెడ్ ప్రీమియం ఎస్‌యూవీ '2012 చెవర్లే కాప్టివా' అనేక విశిష్టమైన, అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫీచర్లతో మార్కెట్లో లభిస్తుంది. ఇది మూడు విభిన్న వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది.

కొత్త 2012 వెర్షన్ చెవర్లే కాప్టివా ఎస్‌యూవీలో ఉండే ప్రధాన ఫీచర్లు, మరియు రాష్ట్ర మార్కెట్లో దీని ధరలు తదితర వివరాలు మా తెలుగు డ్రైవ్ స్పార్క్ పాఠకుల కోసం....

2012 చెవర్లే కాప్టివా ఫీచర్లు:

* విసిడిఐ డీజిల్ ఇంజన్ 150 పిఎస్ పవర్, 320 ఎన్ఎమ్ చార్క్
* సరికొత్త ఫ్రంట్ గ్రిల్
* కొత్త హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్
* ఎస్‌యూవీ సైడ్ బాడీ ప్రొఫైల్‌లో కొద్దిపాటి మార్పు
* సైడ్ మిర్రర్స్‌పై ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్
* 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్
* సెంట్రల్ కన్సోల్‌లో కంట్రోల్స్ స్థానాలలో మార్పు
* కొత్త డ్యాష్‌బోర్డ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
* మెరుగైన ప్లాస్టిక్ నాణ్యత
* ఫోన్లు, ఐపాడ్ వంటి మల్టీమీడియా డివైజ్‌లను సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
* బ్లాక్, రెడ్ కలయికతో కూడిన సీట్లు
* క్రూయిజ్ కంట్రోల్
* హిల్ డిసెంట్ కంట్రోల్
* రెండు వరుసలలో హీటింగ్, వెంటిలేషన్‌తో కూడిన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్
* ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్
* వర్షం పడటాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా పనిచేసే రెయిన్-సెన్స్ వైపర్స్
* స్టయిలిష్ సన్‌రూఫ్
* స్టీరింగ్ వీల్‌పై బ్లూటూత్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కంట్రోల్స్
* వాహనం నడిపే రోడ్డును బట్టి ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకునే సస్పెన్షన్
* ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్
* ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)
* ఆరు ఎయిర్ బ్యాగ్స్
* ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్
* ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి)
* ముందు వైపు, వెనుక వైపు ఫాగ్‌ల్యాంప్స్
* ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

హైదరాబాద్ మార్కెట్లో చెవర్లే కాప్టివా ఎస్‌యూవీ ధరలు:
* Chevrolet Captiva LT BS4 - Rs 1907378
* Chevrolet Captiva Xtreme BS4 - Rs 1982984
* Chevrolet Captiva AWD BS4 - Rs 2095746
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

ఈ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, మిత్సుబిషి పాజెరో, ఫోర్డ్ ఎండీవర్ వంటి ఎస్‌యూవీలతో కొత్త చెవర్లే కాప్టివా పోటీ పడనుంది. ఇటు పవర్, పెర్ఫామెన్స్‌లతో పాటు మంచి సౌకర్యవంతమైన రైడ్‌ను, ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేసే 2012 చెవర్లే కాప్టివా ప్రీమియం ఎస్‌యూవీ ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 28, 2012, 11:06 [IST]
English summary
The new Chevrolet Captiva 2012 SUV comes in three varaints. The entry-level variant is available in both two wheel drive and all wheel drive options with starting prices at Rs 18.74 lakhs and Rs 19.48 lakhs. Meanwhile, the high end 2.2 all wheel drive model is priced at Rs 24.59 lakhs (all prices ex-showroom Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+