అప్‌గ్రేడెడ్ చెవర్లే కాప్టివాను విడుదల చేసిన జనర్ల మోటార్స్
భారత మార్కెట్లో జనరల్ మోటార్స్ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ 'చెవర్లే కాప్టివా'లో ఓ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త 2012 వెర్షన్ చెవర్లే కాప్టివా ఎస్‌యూవీని జనరల్ మోటార్స్ తొలిసారిగా గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. పాత చెవర్లే కాప్టివా కన్నా మరింత అధునాతన ఫీచర్లతో రూపుదిద్దుకున్న 2012 చెవర్లే కాప్టివా ధర రూ.18.74 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది.
కొత్త 2012 చెవర్లే కాప్టివాలో శక్తివంతమైన 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది 3800 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 150 పిఎస్‌ల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో పాటుగా 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లతో కూడా లభ్యమవుతుంది. ఇప్పటి వరకూ చెవర్లే కాప్టివాలో ఆటోమేటిక్ వెర్షన్ లేదు. కాగా.. కొత్తగా విడుదలైన 2012 చెవర్లే కాప్టివా ఈ ఫీచర్‌తో లభిస్తుంది.
పాత కాప్టివాతో పోల్చుకుంటే కొత్త కాప్టివాలో డిజైన్, స్టయిల్ పరగంగా కొద్దిపాటి మార్పులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి ముందువైపు కనిపించే డిజైన్, స్పష్టమైన లెన్స్ కలిగిన ప్రొజెక్షన్ హెడ్‌ల్యాంప్స్, పెద్ద గ్రిల్, ఎయిర్ డ్యామ్స్ మొదలైనవి. కొత్త కాప్టివాలో ఉపయోగించిన 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీ మంచి స్టయిలిష్ లుక్‌నివ్వటమే కాకుండా, ఆఫ్-రోడింగ్‌లో మంచి రోడ్ గ్రిప్‌ను కూడా కలిగి ఉంటాయి.
కొత్త 2012 చెవర్లే కాప్టివా ఎస్‌యూవీ 1565 లీటర్ల బూట్ స్పేస్ విశాలమైన స్టోరేజ్ సదుపాయాన్ని అందిస్తుంది. అంతేకాదు అవసరం లేదనుకున్నప్పుడు వెనుక సీటును మడిచి పెట్టి లగేజ్ స్పేస్ కోసం వాడుకునే సౌలభ్యం కూడా 2012 వెర్షన్ చెవర్లే కాప్టిలో ఉంది. కొత్త కాప్టివాలో ఉండే సరికొత్త ఫీచర్ల గురించి తెలుసుకోవటానికి నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications









