తొలి కస్టమైజ్డ్ ఆడి ఏ8 ఎల్ కారును పొందిన అభిషేక్
* ఆడి ఏ8 ఎల్ కారులో వి8 4.2 లీటర్ టిడిఐ క్యూ ఇంజన్‌ను ఉపయోగించారు.
* ఈ ఇంజన్ గరిష్టంగా 350 బిహెచ్‌పిల శక్తిని, 800 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
* ఇది కేవలం 5.6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
* పొడవాటి వీల్‌బేస్ వెర్షన్ ఆడి ఏ8 సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రమాణాలను అందిస్తుంది.
* ఆడి ఏ8 ఎల్ ధర రూ. 10,075,000 (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర) నుంచి ప్రారంభమవుతుంది.
* ఈ కొత్త ఆడి ఏ8 ఎల్ కారును బాలీవుడ్ సూపర్‌స్టార్ అభిషేక్ బచ్చన్ సొంతం చేసుకున్నారు. అభిషేక్ బచ్చన్ కోసం ఆడి కంపెనీ ఈ కారును ప్రత్యేకంగా కస్టమైజ్ చేసి ఇచ్చింది.
ఇండియాలో అందిస్తున్న హై-టెక్ ఆడి ఏ8 ఎల్ కారుకు లభిస్తున్న అపూర్వ స్పంధన చూసిన తర్వాత, ఇందులో శక్తివంతమైన డీజిల్ ఇంజన్‌తో కూడిన ఈ సరికొత్త ఆడి ఏ8 ఎల్ 4.2 టిడిఐ వేరియంట్‌ను విడుదల చేశామని, తమ బ్రాండ్ ఫిలాసఫీ 'వోర్స్‌ప్రంగ్ డర్క్ టెక్నిక్' అధారంగా చేసుకొని డిజైన్ చేసిన ఈ సరికొత్త వేరియంట్ ఓ కొత్త స్థాయి స్పోర్టీ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుందని, అలాగే సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్ విషయాల్లో మెరుగ్గా ఉంటుందని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు.


Click it and Unblock the Notifications









