ఆడి ఏ8 ఎల్ 4.2 టిడిఐ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఆడి ఇండియా విడుదల చేసిన సరికొత్త వేరియంట్ ఆడి ఏ8 ఎల్ లగ్జరీ సెలూన్‌లో ఉపయోగించిన వి8 4.2 లీటర్ టిడిఐ క్యూ ఇంజన్‌ గరిష్టంగా 350 బిహెచ్‌పిల శక్తిని, 800 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ డీజిల్ ఇంజన్ వలన కారు మంచి స్పోర్టీ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే, పూర్తిస్థాయి విలాసానుభూతిని కూడా ఆఫర్ చేస్తుంది.

ఆడి ఏ8 ఎల్ లగ్జరీ కారులో ఉండే ప్రధాన ఫీచర్లు
బాడీ
* ఏఎస్ఎఫ్ డిజైన్‌తో కూడిన లైట్‌వెయిట్, ఆల్ట్రా-స్ట్రాంగ్ అల్యూమినియం బాడీ
* స్టాండర్డ్ వెర్షన్ 13 సెం.మీ. పొడవుగా ఉంటుంది. మొత్తం పొడవు 5.27 మీటర్లు
* ఆకర్షనీయమైన బాడీ లైన్స్, ఆప్షనల్ ఎల్ఈడి హెడ్‌లైట్స్
* ఆప్షనల్ పనోరామిక్ సన్‌రూఫ్

ఇంటీరియర్స్ అండ్ కంట్రోల్స్
* యాంత్రికంగా నియంత్రించబడే వెనుక సీట్లు, వెనుక సీటులోని ప్రయాణికుల కోసం విలాసవంతమైన ఎగ్జిక్యూటివ్ సీట్ ప్యాకేజ్
* క్రాఫ్ట్‌మ్యాన్-లెవల్ ఫిట్ అండ్ ఫినిష్, మరిన్ని స్టాండర్డ్, ఆప్షనల్ ఎక్విప్‌మెంట్స్
* అడ్వాన్స్‌డ్ ఎమ్ఎమ్ఐ సిస్టమ్

అసిస్టెన్స్ అండ్ సేఫ్టీ సిస్టమ్స్
* పెడస్టేరియన్ మార్కింగ్‌తో కూడిన నైట్ విజన్ అసిస్టెంట్ - ఆప్షనల్
* యాక్సిడెంట్‌ల నుంచి తప్పించుకునేందుకు/తగ్గించేందుకు గాను ఏర్పాటు చేసిన కొత్త ఆడి ప్రీ సెన్స్ బేసిక్ సేఫ్టీ సిస్టమ్.

ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్
* అత్యాధునిక సౌండ్ సిస్టమ్ - ఆప్షనల్
* రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్
* ఆడి మ్యూజిక్ ఇంటర్‌ఫేస్

డ్రైవ్‌ట్రైన్
* ఒక గ్యాసోలైన్ (పెట్రోల్) ఇంజన్ - 4.2 ఎఫ్ఎస్ఐ, 372 హెచ్‌పి
* రెండు డీజిల్ ఇంజన్స్ - 3.0 టిడిఐ, 250 హెచ్‌పి మరియు 4.2 టిడిఐ 350 హెచ్‌పి
* కొత్తగా అభివృద్ధి చేయబడిన, యాంత్రికంగా నియంత్రించబడే 8-స్పీడ్ టిప్‌ట్రానిక్ ట్రాన్సిమిషన్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుంది.
- క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది.

షాషీ (ఛాస్సిస్)
* లైట్‌వెయిట్ సస్పెన్షన్, బ్యాలెన్స్డ్ యాక్సిల్ లోడ్ డిస్ట్రిబ్యూషన్
* ఆడి డ్రైవ్ సెలక్ట్ డ్రైవింగ్ డైనమిక్ సిస్టమ్

ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా ఉన్న 20 డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ఈ సరికొత్త ఆడి ఏ8 ఎల్ 4.2 టిడిఐ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. ఆడి ఇండియా ఈ ఏడాది చివరి నాటికి తమ డీలర్‌షిప్ సంఖ్యను 25 పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 4, 2012, 12:03 [IST]
English summary
The Audi A8 L 4.2 TDI is a V8 engine. It generates power of 258 kW (350 hp) and delivers 800 Nm of torque between 1750-2750 rpm, making it the sportiest diesel saloon in the luxury class. The fuel consumption and CO2 emissions were cut on average by 15%. It accelerates from 0-100 km/h in 5.6 seconds.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+