టొయోటా క్యామ్రీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు - పార్ట్ 2

* ఎకో డ్రైవ్ ఇండికేటర్: ఇందులో ఉన్న ఎకో డ్రైవ్ ఇండికేటర్ మీరు ఎకో రేంజ్‌లో వెళ్తున్నారా లేదా సూచిస్తుంది. ఇది మెరుగైన మైలేజ్‌ను పొందటానికి దోహదపడుతుంది.

* క్రూయిజ్ కంట్రోల్: కొత్త క్యామ్రీలో క్రూయిజ్ చెప్పుకోదగిన ఫీచర్. ఒక్క నిర్ధిష్ట వేగంలో కారును నడిపేందు ఇది సహకరిస్తుంది. ఉదాహరణకు కారును 50 కి.మీ. వేగానికి తీసుకువెళ్లి క్రూయిజ్ కంట్రోల్‌ను ఆన్ చేసినట్లయితే, యాక్సిలరేటర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్ అదే వేగంతో కారు ముందుకు సాగిపోతుంది.

* రెయిన్ సెన్స్ వైపర్స్: కారు ఫ్రంట్ విండ్ స్క్రీన్‌పై నీటి చక్కలు, వర్షపు చినుకులు పడినట్లయితే, వైపర్లు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి.

* ఆప్టిట్రాన్ మీటర్: ఈ కారులో సరికొత్త మీటర్ కన్సోల్ మంచి కాంతితో ప్రకాశిస్తూ, కారులోని వివిధ ఫంక్షనాలిటీలను తెలియజేస్తూ ఉంటుంది.

* మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ కంట్రోల్: కొత్త క్యామ్రీలోని మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఒకేసారి వివిధ పనులు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. డ్రైవర్‌కు ఎలాంటి శ్రమ లేకుండా, పరధ్యానానికి గురి కాకుండా సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ఫీచర్ సహకరిస్తుంది.

Camry 2012
* 8-వే అడ్జస్టబల్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్: ఇందులో డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లను వారి సౌకర్యానుసారంగా ఎనిమిది రకాలుగా సర్దుబాటు చేసుకోవచ్చు.

* వెనక సీటులో విశాలమైన క్యాబిన్ స్పేస్: ఇందులో వెనుక సీటులో కూర్చునే ప్రయాణికులకు విశాలమైన స్పేస్ మరింత సౌకర్యాన్ని చేకూర్చి పెడుతుంది. దూరప్రయాణాల్లో ఎలాంటి అలుపు లేకుండా ఉండేలా ఇది సౌకర్యంగా ఉంటుంది.

* ఉత్తమ సౌండ్ క్వాలిటీతో కూడిన ఆడియో సిస్టమ్: 2012 వెర్షన్ క్యామ్రీలో డివిడి, యూఎస్‌బి, బ్లూటూత్, ఆక్స్-ఇన్ కనెక్టివిటీ, టచ్‌స్క్రీన్, 6-స్పీకర్స్‌తో కూడిన ఆడియో అండ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

* తాకిడిని తట్టుకునే నిర్మాణం: ప్రమాదం జరిగినప్పుడు అవతలి వానం కలిగే తాకిడిని తట్టుకునేలా దీని బాడీని డిజైన్ చేశారు. ఇది అన్నివైపులా ధృడమైన నిర్మాణాన్ని కలిగి ఉండి పూర్తి భద్రను ఇస్తుంది.

* ఏబిస్, ఈబిడి, బ్రేస్ అసిస్ట్: కొత్త క్యామ్రీ బ్రేక్ అసిస్ట్‌‌తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) సేఫ్టీ ఫీచర్లతో లభిస్తుంది. అత్యవసర సమయాల్లో ఇది పూర్తి సురక్షితను ఆఫర్ చేస్తుంది.

* డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్: డ్రైవర్, ప్యాసింజర్ల కోసం ఇందులో ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు.

* టొయోటా క్యామ్రీ ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ప్రతి లీటరు పెట్రోల్‌కు 12.98 కి.మీ. మైలేజీనిస్తుంది.

* కొత్త టొయోటా క్యామ్రీ వైటర్ పెరల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, బీజ్ మెటాలిక్, ఆటిట్యూడ్ బ్లాక్ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

* మార్కెట్లో దీని ధర రూ.24.23 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

మొత్తమ్మీద చూస్తే.. టొయోటా క్యామ్రీ ధర కాస్తంత అధికంగా ఉన్నప్పటికీ, దీని విలాసవంతమైన, సౌకర్యవంతమైన రైడ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఇది ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది. ఇది ఈ సెగ్మెంట్లోని స్కొడా సూపర్బ్, హోండా అకార్డ్, నిస్సాన్ టియాన్ వంటి ప్రీమియం సెడాన్ కార్లకు పోటీగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 24, 2012, 20:13 [IST]
English summary
The new Toyota Camry will be available in four colours: White Pearl Crystal Shine, Silver Metallic, Beige Metallic and Attitude Black. Some of exterior features of the 2012 Camry are chrome radiator grille, 10 spoke 16 inch alloy wheels, body coloured OVRM, chrome door handles, chrome rear garnish, LED brake lights and so on.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+