టొయోటా క్యామ్రీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు - పార్ట్ 1
టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన 7వ తరం 'టొయోటా క్యామ్రీ' ప్రీమియం సెడాన్‌లో విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ లుక్ అండ్ ఫీల్, సేఫ్ అండ్ కంఫర్టబల్ రైడ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని, టొయోటా అప్‌గ్రేడ్ చేసిన 2012 వెర్షన్ క్యామ్రీ సెడాన్‌లో ఫీచర్లను పరిశీలిద్దాం రండి..!!
అప్‌గ్రేడెడ్ టొయోటా క్యామ్రీ సెడాన్‌లోని కీలక ఫీచర్లు:
* సరికొత్త హెడ్‌ల్యాంప్స్: ఇందులో వెడల్పాటి ఆటోమేటిక్ హెచ్ఐడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను ఉపయోగించారు. బయటి వాతావరణంలో కాంతి తగ్గినట్లయితే, సన్సార్లు ఆటోమేటిక్‌గా గుర్తించి లైట్లు వెలిగేలా చేస్తాయి. అంతేకాకుండా, ఇవి స్పష్టమైన, ప్రకాశవంతమైన కాంతిని కలిగి ఉండి రాత్రివేళల్లో సురక్షితమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తాయి.
* కొత్త ఫ్రంట్ గ్రిల్: క్రోమ్ కోటింగ్, టొయోటా లోగోతో కూడిన సరికొత్త రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్ ఈ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
* స్టయిలిష్ ఫాగ్ ల్యాంప్స్: హెడ్‌లైట్స్‌కు కాస్తంత దిగువన ఉండే క్రిస్టల్ క్లియర్ క్లారిటీ కలిగిన ఫాగ్ ల్యాంప్స్, వివిధ వాతావరణ పరిస్థితుల్లో, అలాగే రాత్రివేళల్లో సురక్షితమైన డ్రైవింగ్ కోసం సహరిస్తాయి.
* ఫ్రంట్ బంపర్: కొత్త క్యామ్రీ బంపర్‌ను పూర్తిగా రీడైన్ చేయటం జరిగింది. కొత్త హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, ఎయిర్ డ్యామ్, క్రోమ్ గ్రిల్‌తో ఇది మరింత ప్రీమియం లుక్‌నిస్తుంది.
* కొత్త సైడ్ వ్యూ మిర్రర్స్: స్టయిలిష్ సైడ్ మిర్రర్స్, వాటిపై టర్న్ ఇండికేటర్స్ ఇందులో ప్రత్యేకత. వీటిని డ్రైవర్ సైడ్ డోర్‌పై అమర్చిన స్విచ్‌ల ద్వారా యాంత్రికంగా నియంత్రించవచ్చు.
* 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్: కొత్త క్యామ్రీలో ఉపయోగించిన 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఈ కారు మరింత క్లాసీ లుక్‌ని ఇస్తాయి.
* 2.5లీటర్ డ్యుయెల్ వివిటి-ఐ ఇంజన్: 2012 వెర్షన్ టొయోటా క్యామ్రీలో పవర్‌ఫుల్ 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా వద్ద 181 పిఎస్‌ల శక్తిని, 233 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ సరికొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications









