ఆడి క్యూ3 ఎస్‌యూవీ: బేస్ గ్రేడ్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు
ఆడి క్యూ3 కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో మొదటిది బేస్ గ్రేడ్ వేరియంట్. రెండవది హై గ్రేడ్ వేరియంట్ ఈ రెండు వేరియంట్లు కూడా 2.0 టిడిఐ ఇంజన్‌తోనే లభిస్తాయి. అయితే ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ ఫీచర్లలో మాత్రం అనేక వ్యత్యాసాలు ఉన్నాయి.
ఆడి క్యూ3 ప్రారంభ వేరియంట్ ధర రూ. 26.71 లక్షలు(ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)గా ఉండగా, హై గ్రేడ్ వేరియంట్ ధర రూ. 32.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)గా ఉంది. ఈ రెండు వేరియంట్లలో లభించే ఫీచర్లు వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలను ఇందులో గమనించవచ్చు.
ఆడి క్యూ3 బేస్ వేరియంట్ - కంఫర్ట్ ఫీచర్లు:
* మ్యాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్
* హిల్ స్టార్ట్ అసిస్ట్
* ఎలక్ట్రోమెకానికల్ పార్కింగ్ బ్రేక్
* రివర్సబల్ లోడ్ ఫ్లోర్
* ముందు వైపు 4-వే లూంబర్ సపోర్ట్‌తో కూడిన స్టాండర్డ్ ఫ్రంట్ సీట్
* కుడివైపు సీట్ కోసం ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎడమవైపు సీట్ కోసం మ్యాన్యువల్ హైట్ అడ్జస్ట్
* మడుచుకునేందుకు వీలైన వెనుక (రియర్) సీట్
* రేడియో రిమోట్ కంట్రోల్
* ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్
* రియర్ పార్కింగ్ ఎయిడ్
* క్రూయిజ్ కంట్రోల్
ఆడి క్యూ3 బేస్ వేరియంట్ - ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్లు:
* కాన్సెర్ట్ రేడియో
* ప్యాసివ్ స్పీకర్స్
* డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్
* ఆడి మ్యూజిక్ ఇంటర్‌ఫేస్
* వాయిస్ డైలాగ్ సిస్టమ్
* బ్లూటూత్ ఇంటర్‌ఫేస్


Click it and Unblock the Notifications









