రూ.20 లక్షలకు దిగువ లభించే ప్రీమియం కార్లు - పార్ట్1

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన ఎమ్‌ఎల్యేలకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వంత కారు లేని ఎమ్ఎల్యేలు ప్రజాధనం నుంచే కారును కొనుగోలు చేసేలా ఓ కొత్త ప్రతిపాదనను ఆయన తీసుకువచ్చారు. కారు బడ్జెట్ రూ.20 లక్షలకు మించకుండా ఉండేలా కారును కొనుక్కోవచ్చని యాదవ్ ప్రతిపాదించటం జరిగింది.

ఈ బంపర్ ఆఫర్‌తో రూ.20 లక్షల బడ్జెట్‌లో ఎటువంటి కారును కొనుగోలు చేయాలా అని ఎమ్ఎల్యేలు తికమకలో పడే ఆస్కారం ఉంది. అటువంటి వారి కోసమే ఈ ప్రత్యేక కథనం రూ.20 లక్షల రేంజ్‌లో ఇండియాల లభ్యమవుతున్న ది బెస్ట్ కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

* టొయోటా కరోలా ఆల్టిస్ - రూ.11 లక్షల నుంచి రూ.17 లక్షలు
జపనీస్ కార్ మేకర్ టొయోటా అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ ప్రీమియం సెడాన్ టొయోటా కరోలా ఆల్టిస్. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కరోలా ఆల్టిస్ సెడాన్ స్టయిలిష్ డిజైన్‌తో పాటుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి టొయోటా దీనిని రూపొందించి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

కరోలా ఆల్టిస్ పెట్రోల్ వెర్షన్ నాలుగు వేరియంట్లలో (1.8J, 1.8G, 1.8GL, 1.8VL), ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ కరోలా ఆల్టిస్‌లో 1798సీసీ 2జెడ్ఆర్-ఎఫ్ఈ, 4-సిలిండర్, 16-వాల్వ్ డిఓహెచ్‌సి, డ్యూయెల్ వివిటి-ఐ (డ్యూయెల్ వేరియబల్ వాల్వ్ టైమింగ్-ఇంటలిజెంట్) టెక్నాలజీతో కూడిన ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 140 పిఎస్‌ల శక్తిని, 173 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోలే వేరియంట్ కరోలా ఆల్టిస్ ధరలు రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్).

ఇక డీజిల్ వేరియంట్ కరోలా ఆల్టిస్ విషయానికి వస్తే ఇది మూడు వేరియంట్లలో (D-4D J, D-4D G, D-4D GL) కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తోనే లభిస్తుంది. ఇందులో ఉపయోగించిన 1364సీసీ కామన్ రైల్ డి-4డి, 4-సిలిండర్, వేరియబల్ నాజిల్ టర్బో అండ్ ఇంటర్‌కూలర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 88.4 పిఎస్‌ల శక్తిని, 205 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వేరియంట్ కరోలా ఆల్టిస్ ధరలు రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

ఇవి రెండే కాకుండా.. ప్రస్తుతం టొయోటా కరోలా ఆల్టిస్‌లో ఓ స్పెషల్ ఎడిషన్ కూడా మార్కెట్లో లభిస్తుంది. 'కరోలా ఆల్టిస్ ఏరో' అనే పేరుతో లభిస్తున్న ఈ స్పెషల్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ కారును కేవలం రూ.11.48 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కంపెనీ అందిస్తోంది. అధనపు ఫీచర్లు, సరికొత్త రంగుల్లో కరోలా ఆల్టిస్ ఏరో లభిస్తోంది. అయితే, ఈ స్పెషల్ ఎడిషన్ కరోలా ఆల్టిస్ ఏరో కేవలం పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది.

మొత్తమ్మీద చూస్తే ఈ మూడు వేరియంట్లు కూడా ఆన్-రోడ్ ధర రూ.20 లక్షల లోపే ఉంటాయి. టొయోటా కరోలా ఆల్టిస్ సరసమైన ధరకే విలాసవంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. కాబట్టి, ప్రీమియం లుక్ అండ్ ఫీల్, స్టయిల్, పెర్ఫామెన్స్‌లను కోరుకునే వారు కరోలా ఆల్టిస్‌ను ఎన్నుకోవచ్చు. ఎమ్‌ఎల్యేలు మరి మీ ఛాయిస్ ఏంటి..?

More from DriveSpark

Article Published On: Wednesday, July 4, 2012, 11:35 [IST]
English summary
The stunning new Corolla Altis is a seamless blend of genius performance and gorgeous style. Get enthralled with the genius new Dual VVT-i engine and Super CVT-i with 7-speed Sequential Shiftmatic. Get enchanted with the mesmerising bold new stance. Experience the world's best-selling car that leads the times with new concepts and technologies.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+