రూ.20 లక్షలకు దిగువ లభించే ప్రీమియం కార్లు - పార్ట్ 2

* హోండా సివిక్ - రూ.12.58 లక్షల నుంచి 14.88 లక్షలు
జపనీస్ కార్ కంపెనీ హోండా అందిస్తున్న స్టయిలిష్ ప్రీమియం సెడాన్ హోండా సివిక్. ఇటు ఎగ్జిక్యూటివ్‌ లుక్‌తో పాటుగా అటు ప్రీమియం ఫీల్‌ను అందించే హోండా సివిక్ రూ.20 లక్షలకు దిగువ లభించే కార్లలో మరొక బెస్ట్ ఛాయిస్‌గా చెప్పుకోవచ్చు. కేవలం పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే లభించే హోండా సివిక్ సెడాన్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది.

సరికొత్త ఎలక్ట్రిక్ సన్‌‌రూఫ్, స్పోర్టీ ఫ్రంట్ క్రోమ్ గ్రిల్, స్మోకీ హెడ్‌‌ల్యాంప్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఆడియో కంట్రోల్స్‌తో కూడిన రియర్ ఆర్మ్‌రెస్ట్, పూర్తి ఫ్లాట్ ఫ్లోర్, ఆక్స్ జాక్, ఫ్యాబ్రిక్ డోర్ లైనింగ్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, సీట్ హైట్ అడ్జస్టబల్, స్టయిలిష్ ఇంటీరియర్ ఇల్యూమినేషన్, లెథర్ సీట్స్ వంటి అనేక ప్రీమియం సౌకర్యాలు ఈ కారులో పొందుపరచబడ్డాయి.


హోండా సివిక్‌లో ఉపయోగించిన ఐ-విటెక్ 1.8 లీటర్ (1799సీసీ), 4-సిలిండర్, 16-వాల్వ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 132 పిఎస్ పవర్‌ను, 17.5 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్ హోండా సివిక్ లీటర్ పెట్రోల్‌కు 14.8 కెఎమ్‌పిఎల్ మైలేజీని, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ హోండా సివిక్ లీటర్ పెట్రోల్‌కు 13.9 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుంది. హోండా సివిక్ ధరలు రూ.12.58 లక్షల నుంచి 14.88 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. ఆన్-రోడ్ ధర రూ.20 లక్షల లోపే ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో కూడిన టాప్ ఎండ్ వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చు.

* రెనో ఫ్లూయెన్స్ - రూ. 15.29 లక్షల నుంచి రూ. 15.46 లక్షలు
తాజాగా ఇండియన్ కార్ మార్కెట్లోకి ప్రవేశించిన ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో (Renault) అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఫ్లూయెన్స్. రెనో ఫ్లూయెన్స్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. ఆకర్షనీయమైన లుక్, ప్రీమియం ఫీచర్లను కలిగిన రెనో ఫ్లూయెన్స్ మంచి ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండి లోపలి వైపు ప్యాసింజర్లకు సౌకర్యవంతమైన అనుభూతిని కల్పిస్తుంది.

పెట్రోల్ వేరియంట్ రెనో ఫ్లూయెన్స్ 1997సీసీ ఇంజన్‌ను కలిగి ఉండి 137 పిఎస్ పవర్‌ను, 190 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 13.4 కెఎమ్‌పిఎల్ మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇకపోతే డీజిల్ వేరియంట్ రెనో ఫ్లూయెన్స్ 1461సీసీ డీజిల్ ఇంజన్ 110 పిఎస్‌ల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 20.4 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తోనే లభిస్తాయి. వీటి ధరలు రూ.12.2 లక్షల నుంచి రూ.15.5 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

ప్రధానంగా మైలేజ్ లేదా డీజిల్ వేరియంట్‌ను కోరుకునే వారికి రెనో ఫ్లూయెన్స్ చక్కటి ఆప్షన్‌గా ఉండగా, స్టయిలిష్ లుక్, ప్రీమియం ఫీల్ కోరుకునే వారికి హోండా సివిక్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. మరి మీ ఛాయిస్ ఏంటి..? హోండా సివిక్ లేక రెనో ఫ్లూయెన్స్..?

More from DriveSpark

Article Published On: Wednesday, July 4, 2012, 12:42 [IST]
English summary
The new Honda Civic has stylish exteriors and interior. It offers premium look and feel at affordable price. Honda Civic is available only in petrol variant. French carmaker Renault is offering its premium sedan Fluence in India. Renault Fluence is available in both petrol and diesel engine options.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+