రూ.20 లక్షలకు దిగువ లభించే ప్రీమియం కార్లు - పార్ట్ 3
* చెవర్లే క్రూజ్ - రూ.14.08 లక్షల నుంచి రూ.15.94 లక్షలు
అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ (జిఎమ్) తాజాగా మార్కెట్లోకి సరికొత్త క్రూజ్ సెడాన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఉపయోగించిన సరికొత్త ఎఫ్‌ఏఎమ్ జెడ్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 166 పిఎస్‌ల శక్తిని, 380 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ.14.08 లక్షల నుంచి రూ.15.94 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉన్నాయి. కొత్త క్రూజ్ ప్రతి లీటరుకు 17 కి.మీ. మైలేజీనివ్వనుంది.
* స్కొడా లారా - రూ. 15.67 లక్షల నుంచి రూ. 18.96 లక్షలు
విలాసవంతమైన ఫీల్, రాయల్ లుక్, సాటిలేని పెర్ఫామెన్స్‌లో రూపొందించిన స్కొడా లారా ప్రీమియం సెడాన్ సెగ్మెంట్లో నెంబర్ వన్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ధరకు తగిన విలువను కలిగి ఉండే స్కొడా లారా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ లారా 1798సీసీ ఇంజన్‌ను కలిగి ఉండి 160 పిఎస్‌ల శక్తిని, 250 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వేరియంట్ రెండు విభిన్న పవర్ (110 పిఎస్, 140 పిఎస్) ఆప్షన్లతో లభ్యమవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. స్కొడా లారా ధరలు రూ. 15.67 లక్షల నుంచి 18.96 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.
* ఫోక్స్‌వ్యాగన్ జెట్టా - రూ.15.96 లక్షల నుంచి రూ.18.34 లక్షలు
జర్మన్ కార్ మేకర్ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న జెట్టా సెడాన్ స్కొడా లారా మాదిరిగానే ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌ను అందిస్తుంది. తొలుత జెట్టా చాలా ఖరీదైన కారుగా ఉండేది. అయితే, ప్రస్తుతం ఇది సరసమైన ధరకే మార్కెట్లో లభిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ జెట్టా మొత్తం నాలుగు వేరియంట్ల (ట్రెండ్‌లైన్, కంఫర్ట్‌లైన్, హైలైన్ (మ్యాన్యువల్), హైలైన్ (ఆటోమేటిక్))లో లభిస్తుంది.
ఫోక్స్‌వ్యాగన్ జెట్టాలో ఉపయోగించిన 2.0 లీటర్ సిఆర్ టిడిఐ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వేరియంట్ జెట్టా లీటరుకు 19.33 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ వేరియంట్ జెట్టా 16.96 కి.మీ. మైలేజీనిస్తుంది. డీజిల్ వెర్షన్ ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ధరలు రూ.15.96 లక్షల నుంచి రూ.18.34 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.
ఫోక్స్‌వ్యాగన్ జెట్టా పెట్రోల్ వేరియంట్‌లో కూడా లభిస్తుంది. కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టా టిఎస్ఐ ట్రెండ్‌లైన్, కంఫర్ట్‌లైన్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో ఉపయోగించిన 1.6 లీటర్ టర్బో-ఛార్జ్‌డ్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పిల శక్తిని, 200ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగి కొత్త పెట్రోల్ వేరియంట్ ఫోక్స్‌వ్యాగన్ జెట్టా సెడాన్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. డి-సెగ్మెంట్ సెడాన్‌గా వచ్చిన కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టా పెట్రోల్ వెర్షన్ ప్రారంభ వేరియంట్ (ట్రెండ్‌లైన్) ధర రూ.13.60 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ (కంఫర్ట్‌లైన్) వేరియంట్ ధర రూ.15.07 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications









