జనవరి నుంచి ప్రియం కానున్న జనరల్ మోటార్స్ కార్లు
కొత్త ఏడాదిలో కొత్త కార్లు మరింత ప్రియం కానున్నాయి. జనవరి 2012 నుంచి ఉత్పత్తుల ధరలను పెంచేందుకు కార్ కంపెనీలు స్ననాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా వచ్చే ఏడాది ఆరంభం నుంచి తమ ఉత్పత్తుల ధరలను రూ.20,000 మేర పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా... తాజాగా మారుతి సుజుకి బాటలో జనరల్ మోటార్స్ కూడా కొత్త సంవత్సరంలో తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమైంది.
జనవరి 2013 నుంచి అన్ని చెవర్లే ఉత్పత్తుల ధరలను పెంచనున్నామని జనరల్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ పి బాలెంద్రన్ తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్భణం మరియు ఉత్పాదక వ్యయాల కారణంగా ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వస్తుందని ఆయన వివరించారు. మోడల్‌ను బట్టి ఈ పెంపు 1 నుంచి 3 శాతం రేంజ్‌లో ఉంటుందని ఆయన తెలిపారు. కంపెనీ తాజాగా విడుదల చేసిన చెవర్లే సెయిల్ యూవీఏ హ్యాచ్‌బ్యాక్ ధర కూడా పెరగనుంది.
గడచిన అక్టోబర్ నెలలో చెవర్లే తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. ధరలు పెంచి సరిగ్గా మూడు నెలలు గడవక మునుపే మరోసారి ధరలు పెంచడం గమనార్హం. గడచిన పెంపులో మోడల్‌ను పెంపు రూ.8,000 నుంచి రూ.12,000 మధ్యలో ఉన్నది. జనరల్ మోటార్స్ ప్రస్తుతం చెవర్లే బ్రాండ్ క్రింద స్పార్క్, బీట్, సెయిల్ యూవీఏ, తవేరా నియో 3, క్రూజ్, కాప్టివా మోడళ్లను విక్రయిస్తోంది. భారత మార్కెట్లో వీటి ధరలు రూ.3.26 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి రూ.24.60 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: 2013 నుంచి మారుతి సుజుకి కార్ల ధరల పెంపు


Click it and Unblock the Notifications









