సిఎన్‌జి వెర్షన్ సిటీ సెడాన్‌ను విడుదల చేసిన హోండా
హోండా కార్స్ ఇండియా నుంచి దేశీయ విపణిలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీలో కంపెనీ ఓ సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు గడచిన ఆగస్ట్ నెలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇది వరకు చెప్పుకున్నట్లు గానే, హోండా కార్స్ తమ సిటీ సెడాన్‌లో ఇప్పుడు ఓ సిఎన్‌జి వెర్షన్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత మార్కెట్లో సిఎన్‌జి వెర్షన్ హోండా సిటీ ధర రూ.9.03 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
సిఎన్‌జి కిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ ఈ హోండా సిటీని ప్రత్యేకంగా మోడిఫై చేసింది. హోండా ఆఫర్ చేస్తున్న ఈ సిఎన్‌జి కిట్ ధర రూ.50,300 లుగా ఉంది. నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ఆసక్తి చూపుతుండటం, దీనికి తోడు ఇప్పుడు ప్రధాన మెట్రో నగరాల్లో సిఎన్‌జి లభ్యత కూడా పెరుగుతుండటంతో కంపెనీ ఈ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.
సిఎన్‌జి కిట్‌ను అమర్చేందుకు మోడిఫై చేసిన ఈ కొత్త హోండా సిటీ తిరుగులేని పెర్ఫామెన్స్‌ను, సాటిలేని మైలేజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. మోడిఫై చేస్న హోండా సిటీ కోసం సిఎన్‌జి కిట్‌లను సరఫరా చేసేందుకు గాను రోహన్ బిఆర్‌సిని హోండా కార్స్ తమ అధీకృత డీలర్‌గా నియమించుకుంది. ఈ కొత్త హోండా సిటీ 2 ఏళ్ల స్టాండర్డ్ వారంటీతో లభిస్తుంది. కొత్త హోండా సిటీలో సిఎన్‌జి కిట్‌ను ఫిట్ చేయడానికి గాను ఇందులో మెరుగుపరచబడిన 1.5 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. అలాగే సస్పెన్షన్‌ను కూడా మెరుగుపరచారు. హోండా సిటీ సిఎన్‌జి కూడా పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే మంచి డ్రైవింగ్ అనుభూతిని కల్పిస్తుంది.


Click it and Unblock the Notifications









