డస్టర్ ఎస్‌యూవీతో మార్కెట్లో అగ్గి రాజేసిన రెనో ఇండియా
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్‌యూవీ 'రెనో డస్టర్'లో అనేక విశిష్టతలున్నాయి. రెనో డస్టర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.
అయితే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, పెట్రోల్ కార్ల అమ్మకాలు తగ్గి డీజిల్ అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో, రెనో ఇండియా కూడా పెట్రోల్ వెర్షన్ డస్టర్ కన్నా డీజిల్ వేరియంట్ డస్టర్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. పెట్రోల్ వెర్షన్ డస్టర్ కేవలం రెండు వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతుండగా, డీజిల్ వెర్షన్ డస్టర్ ఆరు వేరియంట్లలో లభ్యమవుతుంది.
రెనో డస్టర్ సాంకేతిక వివరాలను పరిశీలిస్తే..
రెనో డస్టర్ డీజిల్ వెర్షన్ స్పెసిఫికేషన్లు:
* రెనో డస్టర్ డీజిల్ వెర్షన్ ఆరు వేరియంట్లలో, రెండు విభిన్న పవర్ ఆప్షన్లతో ఇది లభ్యమవుతుంది.
* ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ - 1461 సీసీ
* పవర్ - 85 పిఎస్ @ 3,750 ఆర్‌పిఎమ్ (RxE & RxL); 110 పిఎస్ @ 3,900 ఆర్‌పిఎమ్ (RxL & RxZ)
* టార్క్ - 200 ఎన్ఎమ్ @ 1,900 ఆర్‌పిఎమ్ (RxE & RxL); 248 ఎన్ఎమ్ @ 2,250 ఆర్‌పిఎమ్ (RxL & RxZ)
* ట్రాన్స్‌మిషన్ - 5-స్పీడ్ మ్యాన్యువల్ (85 పిస్ వేరియంట్స్‌కు), 6-స్పీడ్ మ్యాన్యువల్ (110 పిస్ వేరియంట్స్‌కు)
* మైలేజ్ - 20.46 కెఎమ్‌పిఎల్ (85 పిస్ వేరియంట్స్‌కు), 19.01 కెఎమ్‌పిఎల్ (85 పిస్ వేరియంట్స్‌కు)
రెనో డస్టర్ పెట్రోల్ వెర్షన్ స్పెసిఫికేషన్లు:
* రెనో డస్టర్ పెట్రోల్ వెర్షన్ రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.
* ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ - 1598 సీసీ
* పవర్ - 104 పిఎస్ @ 5,850 ఆర్‌పిఎమ్
* టార్క్ - 145 ఎన్ఎమ్ @ 3,750 ఆర్‌పిఎమ్
* ట్రాన్సిమిషన్ - 5-స్పీడ్ మ్యాన్యువల్
* మైలేజ్ - 13.24 కెఎమ్‌పిఎల్
మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications









