రెనో డస్టర్ ఎస్‌యూవీస ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలు

రెనో డస్టర్ 1.6 లీటర్ ఇంజన్ ప్రారంభ ధర రూ.7.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండగా, 1.5 లీటర్ డీజిల్ వెర్షన్ రెనో డస్టర్ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. పెట్రోలు డస్టర్ లీటర్‌కు 13.24 కి.మీ మైలేజీనిస్తుందని, 110 పిఎస్ డీజిల్‌ డస్టర్ లీటరుకు 19.01 కి.మీ. మైలేజీని, 85 పిఎస్ డీజిల్‌ డస్టర్ లీటరుకు 20.45 కి.మీ.మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

రెనో డస్టర్ టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్లు:
* 8-వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్
* ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ వ్యూ మిర్రర్స్
* కప్‌ హోల్డర్‌తో కూడిన రియర్ సీట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్
* స్టీరింగ్‌పై ఉండే ఆడియో, ఫోన్ కంట్రోల్స్
* సర్దుబాటు చేసుకునేలా ఏర్పాటు చేసిన టిల్ట్ స్టీరింగ్
* ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్
* వెనుక సీట్‌లోని ప్యాసింజర్లకు సైతం ఏసి వచ్చేలా ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్ మరియు కంట్రోల్
* వెనుక సీటుల్ ప్యాసింజర్లు మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్‌లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా అమర్చిన 12 వోల్ట్ సాకెట్
* 475 లీటర్ల సామర్థ్యం కలిగిన బూట్ స్పేస్
* ఎత్తుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకునే వీలున్న ఫ్రంట్ సీట్ బెల్ట్స్
* ఆన్సర్ బ్యాక్ ఫంక్షన్‌తో కూడిన కీలెస్ ఎంట్రీ సిస్టమ్
* డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజ్ ఎయిర్‌బ్యాగ్స్
* ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
* ముందువైపు ఏర్పాటు చేసిన ఫాగ్ ల్యాంప్స్
* వెనుకవైపు అమర్చిన డిఫాగ్గర్, వైపర్ అండ్ వాషర్
* రివర్స్ పార్కింగ్ సెన్సార్స్
* మోనోకాక్వ్ బాడీ (ఛాస్సిస్ మరియు బాడీ రెండు ఒకే ఫ్లాట్‌ఫామ్‌పై నిర్మించబడినది)
* ఇంజన్ ఇమ్మొబిలైజర్
* డ్యూయెల్ బ్యారెల్ హెడ్‌ల్యాంప్స్
* స్టయిలిష్ రూఫ్ రెయిల్స్
* 16 ఇంచ్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్
* లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్, గేర్ నాబ్
* 5.2 మీటర్ల టర్నింగ్ రేడియస్
* 205 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్

రెనో డస్టర్ ఎస్‌యూవీ కొలతలు:
* పొడవు - 1822 మి.మీ.
* వెడల్పు - 4315 మి.మీ.
* ఎత్తు- 1695 మి.మీ.
* బరువు (పెట్రోల్) - 1740 కేజీలు
* బరువు (డీజిల్ 85 పిఎస్) - 1758 కేజీలు
* బరువు (డీజిల్ 110 పిఎస్) - 1781 కేజీలు

రెనో డస్టర్ ఎస్‌యూవీలో లభించే రంగులు:
* పెరల్ సుప్రీమ్ వైట్
* మెటాలిక్ గ్రాఫైట్ గ్రే
* పెరల్ గెలాక్సీ బ్లాక్
* మెటాలిక్ ఫైరీ రెడ్
* మెటాలిక్ మాన్‌లైట్ సిల్వర్
* మెటాలిక్ వుడ్‌లాండ్ బ్రౌన్

రెనో డస్టర్ ఎస్‌యూవీ ధరలు:
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ 1.6 పెట్రోల్ - రూ. 7.19 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.6 పెట్రోల్ - రూ. 8.19 లక్షలు

* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ 1.5 డీజిల్ 85 పిఎస్ - రూ. 7.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ ఆప్షన్ ప్యాక్ 85 పిఎస్ - రూ. 9.99 లక్షలు

* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ 85 పిఎస్ - రూ. 8.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ 110 పిఎస్ - రూ. 9.99 లక్షలు

* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ 110 పిఎస్ - రూ. 10.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ లెథర్ ప్యాక్ 110 పిఎస్ - రూ. 11.29 లక్షలు

ఈ సెగ్మెంట్లోని మహీంద్రా స్కార్పియో వంటి మోడళ్లతో కొత్త రెనో డస్టర్ ఎస్‌యూవీ పోటీ పడనుంది. రెనో డస్టర్‌ ఎస్‌యూవీ 4 ఏళ్లు లేదా 80,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సర్వీస్ పికప, డ్రాప్ కూడా అందుబాటులో ఉంది. మొత్తమ్మీద రెనో డస్టర్ ఎస్‌యూవీ ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 5, 2012, 19:19 [IST]
English summary
The exterior of the Renault Duster sports decent styling with 16"aluminium wheels, double barrel headlights, stylish roof rail, chrome finish radiator grille, lateral bars and muscular, elegant wheel arches. Though the SUV looks a little bulky, an excellent turning radius of of 5.2 m makes handling an entirely easy task.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+