విడుదలకు ముస్తాబయిన సరికొత్త మారుతి ఎస్ఎక్స్4

ఈ కొత్త మోడల్‌ను 'వైఎల్1' (YL1) అనే కోడ్ నేమ్‌తో మారుతి సుజుకి తమ మానేసర్ ప్లాంటులో అభివృద్ధి చేస్తోంది. పాత మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్‌తో పోల్చుకుంటే కొత్త ఈ కొత్త ఎస్ఎక్స్4 సెడాన్‌లో కొత్త క్రోమ్-ఫినిష్ గ్రిల్, రీ-ప్రొఫైల్ చేయబడిన బంపర్స్, కొత్త హెడ్‌ల్యాంప్స్, సరికొత్త రియర్ డిజైన్ వంటి బాహ్య మార్పులు ఉండనున్నాయి. చైనాలో అమ్ముడవుతున్న ఫేస్‌లిఫ్ట్ ఎస్ఎక్స్4 సెడాన్‌లో చేసిన మార్పుల చేర్పులనే ఇండియన్ వెర్షన్ ఎస్ఎక్స్4 సెడాన్‌లోను చేయనున్నట్లుగా తెలుస్తోంది.
ఇంటీరియర్స్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. టాప్-ఎండ్ వేరియంట్‌లో నావిగేషన్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభించే అవకాశం ఉంది. అయితే, యాంత్రికపరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఇంజన్లనే కొత్త వాటిలోను ఉపయోగించనున్నారు.
పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో ఉపయోగించిన 1586సీసీ ఇంజన్ 104.7 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో ఉపయోగించిన 1248సీసీ ఇంజన్ 90 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్4 సెడాన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (జెడ్ఎక్స్ఐ వేరియంట్)లతో లభిస్తుండగా డీజిల్ వేరియంట్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








