6,000 లకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకున్న రెనో డస్టర్

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా (Renault India) తాజాగా దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన చీప్ అండ్ బెస్ట్ ఎస్‌యూవీ రెనో డస్టర్ (Renault Duster) మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. గడచిన వారంలో మార్కెట్లోకి వచ్చిన రెనో డస్టర్ ఇప్పటికే 6,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ఆకర్షనీయమైన లుక్, సరసమైన ధర, సాటిలేని పెర్ఫామెన్స్, మెరుగైన మైలేజ్ వంటి ఫీచర్లతో రెనో డస్టర్ కస్టమర్లను ఇట్టే కట్టిపడేస్తోంది.

సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్లను కొనాలని నిర్ణయించుకున్న కస్టమర్లను సైతం రెనో డస్టర్ తనవైపుకు తిప్పుకుంటుంది. కేవలం రూ.8 లక్షల ప్రారంభ ధరకే డీజిల్ వెర్షన్ రెనో డస్టర్‌ను కంపెనీ అందిస్తుండటంతో ఈ సెగ్మెంట్లో చవకైన ఎస్‌యూవీల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.


పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం ఎనిమిది వేరియంట్ల (రెండు పెట్రోల్, నాలుగు డీజిల్ వేరియంట్ల)లో రెనో డస్టర్ మార్కెట్లో లభ్యమవుతోంది. మార్కెట్లో రెనో డస్టర్ ప్రారంభ వేరియంట్ ధర రూ.7.19 లక్షలు (ఆర్ఎక్స్ఈ 1.6 పెట్రోల్)గా మాత్రమే ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.11.29 లక్షలు (ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ లెథర్ ప్యాక్ 110 పిఎస్)గా ఉంది.

రెనో డస్టర్‌లో వేరియంట్ వారీగా లభించే ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ 1.6 పెట్రోల్ - రూ. 7.19 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.6 పెట్రోల్ - రూ. 8.19 లక్షలు

* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ 1.5 డీజిల్ 85 పిఎస్ - రూ. 7.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ ఆప్షన్ ప్యాక్ 85 పిఎస్ - రూ. 9.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ 85 పిఎస్ - రూ. 8.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ 110 పిఎస్ - రూ. 9.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ 110 పిఎస్ - రూ. 10.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ లెథర్ ప్యాక్ 110 పిఎస్ - రూ. 11.29 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

రెనో డస్టర్‌ ఎస్‌యూవీ మైలేజ్:
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ (పెట్రోల్) - 13.24 కెఎమ్‌పిఎల్
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ (85 పిఎస్ డీజిల్) - 20.45 కెఎమ్‌పిఎల్
* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ (110 పిఎస్ డీజిల్) - 19.01 కెఎమ్‌పిఎల్

More from DriveSpark

Article Published On: Monday, July 9, 2012, 10:14 [IST]
English summary
Renault Duster SUV which was launched on July 4 has gained more than 6,000 bookings from across the country so far. The carmaker will launch the Duster in other cities according to schedule. Renault India had started taking bookings for the Duster two weeks before its launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+