రెనో డస్టర్ ఎస్‌యూవీలో ఉండే కీలక ఫీచర్లు

రెనో డస్టర్‌ను తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఇందులోని పెట్రోల్ వేరియంట్‌లో అనేక ఫీచర్లను తగ్గించి వేసింది. అయితే, టాప్-ఎండ్ డీజిల్ వేరియంట్ (ఆర్ఎక్స్‌జెడ్) మాత్రం పూర్తి ఫీచర్లతో మభ్యమవుతుంది. రెనో డస్టర్ 4 ఏళ్లు (2+2) లేదా 80,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది. రెనో డస్టర్‌లో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు, అన్ని వేరియంట్లు కూడా టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తోనే లభిస్తాయి. పెట్రోల్ వేరియంట్ రెనో డస్టర్ 102 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.6లీటర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. డీజిల్ వేరియంట్ రెనో డస్టర్ 85పిఎస్, 110పిఎస్‌ల పవర్‌తో 1.5 డిసిఐ ఇంజన్‌తో లభిస్తుంది.


కాగా.. రెనో డస్టర్ ఎస్‌యూవీలో లభించే విశిష్టమైన ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

* విశిష్టమైన, ఆధునిక డిజైన్
* ట్రెండీ, కాంపాక్ట్ అర్బన్ ఎస్‌యూవీ
* స్టయిలిష్ క్రోమ్ గ్రిల్
* ట్విన్ బ్యారెల్ హెడ్‌ల్యాంప్స్
* 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్
* ముందు వైపు ఫాగ్‌ల్యాంప్స్
* కీలెస్ ఎంట్రీ
* బ్రేక్ అసస్ట్, ఈబిడితో కూడిన ఏబిఎస్
* డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్
* ప్లష్ లెథర్ సీట్స్
* రియర్ ఏసి వెంట్స్
* యూఎస్‌బి, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీ, 4 స్పీకర్లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్
* స్టీరింగ్‌వీల్‌పై ఉండే ఆడియో, ఫోన్ కంట్రోల్స్
* రియర్ డిఫాగ్గర్, వైపర్ అండ్ వాషర్
* ఎలక్ట్రిక్ సైడ్ వ్యూ మిర్రర్స్
* రియర్ పార్కింగ్ సెన్సార్స్
* 475 లీటర్ల బూట్ స్పేస్

More from DriveSpark

Article Published On: Monday, July 9, 2012, 10:09 [IST]
English summary
The Duster SUV comes in 8 variants - two petrol and 6 diesel. The five seater SUV will competes with the likes of Mahindra Scorpio and Tata Safari in the Indian market. One of the major highlights of the SUV is its highly fuel efficient diesel engine. The Duster boasts best in class fuel economy of 20.45 kmpl for the 1.5 dCi K9K HP, 85 hp diesel powertrain.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+