రెనో స్కాలాలో ఆటోమేటిక్ వెర్షన్ కూడా రావచ్చు!

నిస్సాన్ సన్నీ సెడాన్‌లో ఉపయోగించిన 1.5 లీటర్ కె9కె 85 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్‌నే రెనో స్కాలా సెడాన్‌లోను ఉపయోగించటం జరిగింది. రెనో స్కాలా బూట్ డోర్‌పై సరికొత్త క్రోమ్ బార్‌ను ఏర్పాటు చేశారు. ఏ ఏడాది దీపావళి నాటికి ఈ కొత్త కారు మార్కెట్లో విడుదల కానుంది. అయితే, ధర విషయంలో మాత్రం ఇది నిస్సాన్ సన్నీ కన్నా కాస్తంత అధికంగా ఉండనుంది. ఉత్తత్పి వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఇరు కంపెనీలు తమ ఉత్పత్తుల ఫ్లాట్‍‌ఫామ్‌లను ఒకరికొకరు పంచుకోవటం జరిగింది. రెనో స్కాలాలో ఆటోమేటిక్ వేరియంట్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.


స్కాలా విడుదల విషయంలో రెనో ఇండియా తమ పల్స్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన విధానాన్నే అనుసరించే అవకాశం ఉంది. పల్స్‌ను కంపెనీ తొలుత డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో విడుదల చేసి అనంతరం పెట్రోల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఇదే విధంగా స్కాలా కూడా తొలుతగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తోను అనంతరం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తోను లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పెట్రోల్ వేరియంట్ స్కాలాను ప్రవేశపెట్టినప్పటికీ అందులో నిస్సాన్ సన్నీ పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.5 లీటర్ 98 హెచ్‌పి ఇంజన్‌నే ఉపయోగించే అవకాశం ఉంది.

ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ కూడా డీజిల్ కార్ల వైపే ఉండటం కూడా ఇందుకు మరొక కారణంగా చెప్పుకోవచ్చు. రెనో స్కాలా సెడాన్ రెనో ఇండియా నుంచి రానున్న ఐదవ ఉత్పత్తి కావటం విశేషం. నిస్సాన్-రెనో భాగస్వామ్యంలో చెన్నైలో నిర్వహించబడుతున్న ఫ్యాక్టరీలోనే రెనో స్కాలా సెడాన్‌ను కంపెనీ ఉత్పత్తి చేయనుంది. నిస్సాన్ సన్నీ సెడాన్ మాదిరిగానే రెనో స్కాలా కూడా ఇండియన్ మార్కెట్ నుంచి ఇతర దేశాలకు కంపెనీ ఎగుమతి చేయనుంది. ప్రస్తుతం రెనో ఇండియా పల్స్ హ్యాచ్‌బ్యాక్, ప్రీమియం సెడాన్ ఫ్లూయెన్స్, ప్రీమియం ఎస్‌యూవీ కొలియోస్, ఎస్‌యూవీ డస్టర్ ఉత్పత్తులను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 23, 2012, 18:34 [IST]
English summary
A quick diagnosis of the Scala and one realizes that it is very similar to the Nissan sunny. For a fact, the Scala is Renault's version of the Nissan Sunny. Renault is hoping to capture a share of the mid-size sedan category in India via the Scala.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+