బోనీ కపూర్‌కు పోర్షే కారును కానుకగా ఇచ్చిన శ్రీదేవి
ఇప్పటికీ పదహారేళ్ల పడుచుపిల్లలా కనిపించే అలనాటి నటి శ్రీదేవి తన భర్తకు ఓ అద్భుతమైన కానుకను ఇచ్చింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ని వివాహం చేసుకొని టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మకాం మార్చి వెండితెరకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని జర్మన్ స్పోర్ట్స్ కార్ కంపెనీ అందిస్తున్న 'పోర్షే కయూన్' (porsche cayenne) కారును బోనీ కపూర్‌కు బహుమతిగా ఇచ్చింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారత మార్కెట్లో 100వ పోర్షే కయూన్ లగ్జరీ కారును సొంతం చేసుకున్న కస్టమర్ కూడా శ్రీదేవే కావటం విశేషం.

బోనీ కపూర్‌కు పోర్షే కయూన్ గిఫ్ట్
ప్రముఖ నటి శ్రీదేవి తన భర్త బోనీ కపూర్‌కు ఓ జర్మన్ మేడ్ 'పోర్షే కయూన్' (porsche cayenne) కారును బహుమతిగా ఇచ్చింది.

ఇండియాలో 100వ కస్టమర్ శ్రీదేవి
భారత మార్కెట్లో 100వ పోర్షే కయూన్ లగ్జరీ కారును సొంతం చేసుకున్న కస్టమర్ కూడా శ్రీదేవే కావటం విశేషం.

ఇంజన్
పోర్షే కయూన్ డీజిల్ కారులో శక్తివంతమైన 2967సీసీ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 245 హెచ్‌పిల శక్తిని, 550 ఎన్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

శ్రీదేవి - బోనీ కపూర్
తన భర్త కోసం కొనుగోలు చేసిన పోర్షే కయూన్ కారుతో ఫోటోలకు ఫోజులిస్తున్న నటి శ్రీదేవి, ఆమె భర్త బోనీ కపూర్.

జర్మన్ స్పోర్ట్స్ కారుతో శ్రీదేవి
పోర్షే కయూన్ కారుతో నటి శ్రీదేవి.

మీడియాతో ముచ్చట్లు
కారు కొనుగోలు అనంతరం మీడియాతో మాట్లాడుతున్న శ్రీదేవి, బోనీ కపూర్.

పోర్షే కయూన్ - పెర్ఫామెన్స్
ఈ లగ్జరీ కారు కేవలం 1.6 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని, 20 సెకండ్లలోనే 0-160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

పోర్షే కయూన్ - ట్రాన్సిమిషన్
పోర్షే కయూన్ డీజిల్‌లో 8-స్పీడ్ టిప్‌ట్రానిక్ ఎస్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (8 ఆటోమేటిక్ గేర్లు) అమర్చారు. ఇది ఆటో స్టార్ట్ స్టాప్ ఫంక్షన్‌తో లభిస్తుంది. మ్యాన్యువల్‌గా గేర్ మార్చుకోవాలనుకున్నప్పుడు స్టీరింగ్ వీల్‌పై ఉండే అప్ డైన్ బటన్‌లను నొక్కటం ద్వారా గేరును మార్చుకోవచ్చు.

పోర్షే కయూన్ లగ్జరీ కారు
ఈ కారు 4,846 మి.మీ. పొడవును, 1,939 మి.మీ. వెడల్పును, 1,705 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,895 మి.మీ. కాగా మొత్తం బరువు 2175 కిలోలు.

పోర్షే కయూన్ - ఇంటీరియర్స్
అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన పోర్షే కయూన్ విలాసవంతమైన ఇంటీరియర్లను కలిగి ఉంటుంది. ఈ కారును నడుపుతుండే ఓ స్పోర్ట్స్ కారును నడుపుతున్న అనుభూతి కలుగుతుంది. డ్రైవర్ ఎక్కువ శ్రమ లేకుండా ఎంత దూరమైనా సరే ఈ కారును సౌకర్యవంతంగా నడపవచ్చు.

పోర్షే కయూన్ - మైలేజ్
పోర్షే కయూన్ లీటర్ డీజిల్‌కు సుమారు 13-14 కిలోమీటర్ల మైలైజీని ఆఫర్ చేస్తుంది.

పోర్షే కయూన్ - ధర
భారత మార్కెట్లో పోర్షే కయూన్ ప్రారంభ ధర రూ.65 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

పోర్షే కయూన్ - 5-సీటర్
పోర్షే కయూన్ లగ్జరీ కారులో ఐదుగురు ప్రయాణికులు (డ్రైవర్‌తో కలిపి) సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
పోర్షే కయూన్ డీజిల్ కారు విషయానికి వస్తే.. ఇందులో శక్తివంతమైన 2967సీసీ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 245 హెచ్‌పిల శక్తిని, 550 ఎన్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 1.6 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని, 20 సెకండ్లలోనే 0-160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.
పోర్షే కయూన్ డీజిల్‌లో 8-స్పీడ్ టిప్‌ట్రానిక్ ఎస్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (8 ఆటోమేటిక్ గేర్లు) అమర్చారు. ఇది ఆటో స్టార్ట్ స్టాప్ ఫంక్షన్‌తో లభిస్తుంది. మ్యాన్యువల్‌గా గేర్ మార్చుకోవాలనుకున్నప్పుడు స్టీరింగ్ వీల్‌పై ఉండే అప్ డైన్ బటన్‌లను నొక్కటం ద్వారా గేరును మార్చుకోవచ్చు. ఈ కారు 4,846 మి.మీ. పొడవును, 1,939 మి.మీ. వెడల్పును, 1,705 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,895 మి.మీ. కాగా మొత్తం బరువు 2175 కిలోలు.
కపిల్ దేవ్ పోర్షే సవారీ..
ఇదిలా ఉండగా.. భారతదేశానికి మొట్టమొదటి ప్రపంచ కప్‌ను తెచ్చిపెట్టిన మాజీ భారత జట్టు కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ కూడా ఓ ఇటీవలే ఓ పోర్షే కారును కొనుగోలు చేసి సంగతి తెలిసిందే. భారత్‌లోనే మొట్టమొదటి పోర్షే పనమెరా డీజిల్ స్పోర్ట్ కారును కపిల్ దేవ్ సొంతం చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications








