ఫెస్టివ్ సీజన్ కోసం టొయోటా లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లు
ఈ పండుగ సీజన్‌లో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) 'లిమిటెడ్ ఎడిషన్' మంత్రాన్ని జపిస్తోంది. ఇప్పటికే పలు మోడళ్లలో లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన టికెఎమ్ ఇప్పుడు తాజాగా, కంపెనీ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ 'టొయోటా ఫార్చ్యూనర్'లో ఓ కొత్త వేరియంట్‌ను విపణిలోకి విడుదల చేసింది. 'టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్'గా పిలిచే ఈ వేరియంట్ మరింత స్పోర్టీ లుక్‌ను కలిగి ఉండి, క్రింద తెలిపిన విఫీచర్లతో లభ్యం కానుంది.
టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్లు:
- కొత్త డిజైన్ కలిగిన ఫ్రంట్ బంపర్, స్పాయిలర్
- కొత్త డిజైన్ కలిగిన రియర్ రూఫ్ స్పాయిలర్
- కొత్త డిజైన్ కలిగిన రియర్ బంపర్
- స్టయిలిష్‌గా డిజైన్ చేయబడిన టిఆర్‌డి స్పోర్టివ్ లోగో

ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో ఫీచర్లు
* కొత్త డిజైన్ కలిగిన ఫ్రంట్ బంపర్, స్పాయిలర్
* కొత్త డిజైన్ కలిగిన రియర్ రూఫ్ స్పాయిలర్
* కొత్త డిజైన్ కలిగిన రియర్ బంపర్
* స్టయిలిష్‌గా డిజైన్ చేయబడిన టిఆర్‌డి స్పోర్టివ్ లోగో

ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో ఫీచర్లు
* ఫ్రంట్ బంపర్ స్పాయిలర్
* సైడ్ స్కర్ట్స్
* స్పోర్టీ బాడీ గ్రాఫిక్స్
* రియర్ బంపర్ స్పాయిలర్
* కొత్త 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్
* కొత్త డ్యూయెల్ టోన్ సీట్ ఫ్యాబ్రిక్
* సిల్వర్ షిఫ్ట్ లివర్ గేర్ నాబ్
* పెట్రోల్ వెర్షన్ ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో ధర రూ.6,25,322 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
* డీజిల్ వెర్షన్ ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో ధర రూ. 7,31,445 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్లు
* కొత్త గ్రిల్
* రీస్టయిల్ చేయిన రియర్ కాంబినేషన్ ఎల్ఈడి ల్యాంప్స్
* మోడిఫై చేయబడిన రియర్ బంపర్
* వెనుకవైపు లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జ్
* బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 5.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఆడియో సిస్టమ్
* కొత్త 4-స్పోక్ స్టీరింగ్ వీల్
* కీలెస్ ఎంట్రీ
* 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్
* డ్రైవర్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్
* ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)

ఇన్నోవా ఏరో ఫీచర్లు
* డ్యూయెల్ టోన్ రియర్ బంపర్ స్పాయిలర్
* సైడ్ స్కర్ట్
* రూఫ్ స్పాయిలర్
* ఏరో లోగో

టొయోటా ఫెస్టివ్ ఆఫర్స్
కేవలం లిమిటెడ్ ఎడిషన్‌లను విడుదల చేయటమే కాకుండా, ఆకర్షనీయమైన ప్యాకేజీలు, ఫైనాన్స్ స్కీమ్‌లు, ఇన్సూరెన్స్ బెనిఫిట్‌లు, యాక్ససరీ ప్యాకేజ్‌లు, కస్టమర్ లాయల్టీ స్కీమ్‌లు, ఎక్సేంజ్ ఆఫర్లు వంటి వాటిని కూడా టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఆఫర్ చేస్తోంది.
కేవలం 600 యూనిట్ల టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీలను మాత్రమే కంపెనీ విక్రయించనుంది. ఇవి డిసెంబర్ నెలాఖరు వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ఇది టూ-వీల్ (4x2) డ్రైవ్ ఆప్షన్‌తో మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. దేశీయ విపణిలో దీని ధరలు రూ. 21.75 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి రూ. 22.60 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి. సూపర్ వైట్, సిల్వర్ మైకా మెటాలిక్ అనే రెండు ఆకర్షనీయమైన రంగుల్లో టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్ లభ్యమవుతోంది.
టొయోటా ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్:
ఎతియోస్ సెడాన్‌లో మరింత స్పోర్టీ ఫీల్ కోరుకునే వారికో కంపెనీ 'టొయోటా ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో' లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇందులో 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ మరియు స్పాయిలర్స్, సైడ్ స్కర్ట్స్‌తో కూడిన బాడీ కిట్, డోర్లపై టిఆర్‌డి స్పోర్టివో స్టిక్కర్స్, టిఆర్‌డి స్పోర్టివో బ్యాడ్జింగ్, క్రోమ్ కోటింగ్ కలిగిన గేర్ నాబ్, టిఆర్‌డి స్పోర్టివో లోగోలతో కూడిన డ్యూయెల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్ వంటి మార్పులు ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్ ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో ధర రూ.6.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, డీజిల్ వెర్షన్ ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో ధర రూ.7.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
టొయోటా కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్:
ఈ ఫెస్టివ్ సీజన్ కోసం టొయోటా అందిస్తున్న సి-సెగ్మంట్ సెడాన్ కరోలా ఆల్టిస్‌లో మరిన్ని అదనపు ఫీచర్లతో కూడిన ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. షాంపేన్ మైకా, సిల్వర్ మెటాలిక్, సూపర్ వైట్ అనే మూడు విశిష్ట రంగుల్లో లభ్యమయ్యే ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ ధరలు ఇలా ఉన్నాయి.
టొయోటా కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ ధర:
* పెట్రోల్ వెర్షన్ బేస్ వేరియంట్ లిమిటెడ్ ఎడిషన్ టొయోటా కరోలా ఆల్టిస్ ధర రూ.11.45 లక్షలు
* డీజిల్ వెర్షన్ బేస్ వేరియంట్ లిమిటెడ్ ఎడిషన్ టొయోటా కరోలా ఆల్టిస్ ధర రూ.12.84 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)
టొయోటా ఇన్నోవా ఏరో లిమిటెడ్ ఎడిషన్:
టొయోటా కిర్లోస్కర్ మోటార్ గడచిన నెలలో ఓ లిమిటెడ్ ఎడిషన్ టొయోటా ఇన్నోవా ఏరో ఎమ్‌పివిని కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేవలం 1,200 యూనిట్ల టొయోటా ఇన్నోవా ఏరో లిమిటెడ్ ఎడిషన్‌లను మాత్రమే కంపెనీ విక్రయించనుంది. ఇవి కూడా డిసెంబర్ నెలాఖరు వరకూ అందుబాటులో ఉంటాయి. దేశీయ విపణిలో ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.12.25 లక్షల నుంచి రూ.12.30 లక్షల రేంజ్ (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








