పండుగ సీజన్‌లో రానున్న కార్లు - చెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్

అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ ఇండియా ఈ ఏడాది భారత మార్కెట్‌కు సరికొత్త మోడళ్లను పరిచయం చేయనుంది. ఇప్పటికే, అప్‌గ్రేడెడ్ చెవర్లే తవేరా నియో3 ఎమ్‌పివి, ఫేస్‌లిఫ్ట్ చెవర్లే కాప్టివా ఎస్‌యూవీ, రిఫ్రెష్డ్ వెర్షన్ క్రూజ్ మోడళ్లను దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన జనరల్ మోటార్స్ ఈ పండుగ సీజన్‌లో మరొక చిన్న కారును విడుదల చేసే అవకాశం ఉంది.


ప్రస్తుతం జనరల్ మోటార్స్ ఇండియా చెవర్లే బ్రాండ్‌లో అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ చెవర్లే యూవీ-ఏ మోడల్‌ను రీప్లేస్ చేయడానికి 'సెయిల్' హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20 మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. జనరల్ మోటార్స్ తమ సెయిల్ కారును చైనాలోని తమ భాగస్వామి ఎస్ఏఐసితో కలిసి రూపొందిస్తుంది.

గడచిన జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో జనరల్ మోటార్స్ చెవర్లే సెయిల్‌ను తొలిసారిగా ఇండియాకు పరిచయం చేసింది. చెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ లేదా మరింత శక్తివంతమైన 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చే అవకాశం ఉంది. ఇది డీజిల్ వేరియంట్లో కూడా లభ్యం కానుంది. డీజిల్ వేరియంట్ సెయిల్‌లో 1.3 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా. అన్ని వేరియంట్లు కూడా సమర్థవంతమైన 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యం కానున్నాయి. భారత మార్కెట్లో చెవర్లే సెయిల్ ప్రారంభ ధర రూ.5 లక్షల మేర ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Saturday, August 18, 2012, 17:53 [IST]
English summary
US auto major Geral Motors is expected to its Chevrolet Sail hatchback in this festive season. This premium smll cas was showcased during the 2012 Delhi Auto Expo. Chevrolet Sail will replace the present U-Va.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+