పండుగ సీజన్‌లో రానున్న కార్లు - కొత్త మారుతి రిట్జ్
మారుతి సుజుకి అందిస్తున్న రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఓ రిఫ్రెష్డ్ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ ఇటీవలే ఈ రిఫ్రెష్డ్ వెర్షన్ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌ను జపాన్ మార్కెట్లో సుజుకి స్ప్లాష్ అనే పేరుతో విడుదల చేసింది. కాగా.. ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మారుతి సుజుకి రిట్జ్ కారును కంపెనీ టెస్టింగ్ నిర్వహిస్తోంది.
మారుతి సుజుకి ఇటీవలే ఇండియాకు రానున్న కొత్త రిఫ్రెష్డ్ వెర్షన్ రిట్జ్ ఫోటోలోను విడుదల చేసింది. ఈ అప్‌గ్రేడెడ్ మారుతి సుజుకి రిట్జ్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, సరికొత్త డిజైన్‌తో కూడిన ఫ్రంట్ ఫాగ్‌ల్యాంప్స్, రివైజ్ చేసిన బానెట్ డిజైన్, కొద్దిగా మార్పు చేయబడిన ఫ్రంట్ హెడ్‌లైట్స్, వెనుక వైపు బంపర్‌పై నకిలీ (ఫేక్) ఎయిర్ వెంట్స్ వంటి మార్పులు ఉన్నాయి.
ఈ కొత్త మారుతి సుజుకి రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్స్‌లో కూడా చిన్న చిన్న మార్పులు ఉండనున్నాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించి పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే రిట్జ్‌లో కూడా ఉపయోగించారు. ఇందులో ఉపయోగించిన 1.2 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజన్ 84 బిహెచ్‌పిల శక్తిని, 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ 74 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించనున్నాయి.
మొదటి తరం రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌ను 2009లో మారుతి సుజుకి విడుదల చేసింది. తాజాగా మార్కెట్లోకి రానున్న కొత్త రిట్జ్ రెండవ తరానికి చెందినది. ప్రస్తుతం మానేసర్ ప్లాంట్ సమస్య కారణంగా స్విఫ్ట్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం ఇంజన్, పవర్, పెర్ఫామెన్స్, మైలేజ్, ధర వంటి అంశాలను పరిగణలోకి తీసుకునేవారు స్విఫ్ట్ కోసం నెలల తరబడి వేచి ఉండే బదులు మారుతి సుజుకి రిట్జ్‌ను ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications









