2013 ఇండియన్ గ్రాండ్ ప్రిలో లేని సెలబ్రిటీల సందడి
మనదేశం ఫార్ములా వన్ రేస్‌కు ఆదరణ క్రమంగా తగ్గుతోంది. గడచిన 2011వ సంత్సరంలో తొలిసారిగా భారత్‌లోకి ప్రవేశించిన ఈ మోటార్‌స్పోర్ట్‌కు మొదట్ల లభించిన స్పందన ఇప్పుడు లభించడం లేదు. తొలి రెండు సంవత్సరాల్లో ఇండియన్ గ్రాండ్ ప్రిలో మన సెలబ్రిటీలు హాట్ సెన్సేషన్‌గా నిలిచారు. తాజాగా జరిగిన 2013 ఇండియన్ గ్రాండ్ ప్రిలో సెలబ్రిటీలు కరువయ్యారు.
మొదటి రెండు ఎడిషన్లలో సచిన్ టెండూల్కర్‌తో పాటు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మొదైలన విఐపిలు ప్రధాన ఆకర్షనగా నిలిచారు. అయితే, ఈ ఏడాది గుల్షన్ గ్రూవర్, గుల్ పనాగ్, మానవ వనరుల శాఖా మంత్రి శశి థరూర్ ఆయన సతీమణి సునందా పుష్కర్ మరియు షూటర్ రంజన్ సోధిలు మాత్రమే బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద కనిపించారు.
ఇది కూడా చదవండి: 2012 ఇండియన్ గ్రాండ్ ప్రిలో సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
గడచిన ఆదివారం జరిగిన ఫైనల్ రేసులో మెయిన్ గ్రాండ్ స్టాండ్ దాదాపు సగానికి పైగా ఖాలీగా కనిపించింది. తొలిసారిగా ఫార్ములా వన్ రేస్ 2011లో భారత్‌లోని గ్రేటర్ నోయిడాలో అధునాతంగా ఏర్పాటు చేసిన బుద్ధ్ ఇంటర్నేషల్ సర్క్యూట్‌లో ప్రారంభమైనప్పుడు 97,000 టికెట్లు అమ్ముడుపోయాయి. 2012 గ్రాండ్ ప్రి సమయానికి ఈ సంఖ్య 67,000 లకు పడిపోయింది.
కాగా.. తాజాగా ముగిసిన 2013 ఇండియన్ గ్రాండ్ ప్రికి కేవలం 40,000 లకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. మరో వైపు నిర్వహణ పెరగటం, భారీ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి రావటంతో ఫార్ములా వన్ నిర్వాహకులకు ఇండియన్ గ్రాండ్ ఆర్థికంగా గిట్టుబాటు కావటం లేదు. అంతేకాకుండా, 4 మిలియన్ డాలర్ల వినోద పన్ను మినహాయింపును ఉపసంహరించడం, రేసుతో సంబంధం ఉన్న ఇతర ఖర్చుల పట్ల ఎఫ్1 అధినేత, బృందాలు అసంతృప్తిగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications









