వైర్‌లెస్ మౌస్‌ను విడుదల చేసిన ఆడి ఇండియా

By Ravi

లగ్జరీ బ్రాండ్ గ్యాడ్జెట్లన్నా, వస్తువులన్నా ఎవరికి మాత్రం ప్రీతి ఉండదు చెప్పండి. అలాంటి వారి కోసమే జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఓ సరికొత్త, శక్తివంతమైన వైర్‌లెస్ కంప్యూటర్ మౌస్‌ను విడుదల చేసింది. ఆడి కారు షేపులో ఉండేలా కంపెనీ ఈ మౌస్‌ను డిజైన్ చేసింది.

మెటాలిక్ ఆడి కారు షేపులో ఉండే ఈ కంప్యూటర్ వైర్ లెస్ మౌస్ 2.4 గిగా హెట్జ్ టెక్నాలజీతో, స్క్రాల్ వీల్‌ను మరియు హై-రెజల్యూషన్ 200 డిపిఐ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ మౌస్ గరిష్ట వైర్ లెస్ రేంజ్ 6 మీటర్లు. మరి దీని ధరెంతో తెలుసా జస్ట్ రూ.5,559 మాత్రమే.

ఇది 1.1 లేదా 2.0 యూఎస్‌బి పోర్టుకు సూట్ అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆడి ఇండియా అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలలో ఇది లభ్యమవుతుంది. ఆడి ఇండియా ఇలా మర్చండైజ్‌లను విడుదల చేయటం ఇదే మొదటిసారేం కాదు.

గతంలో ఆడి ఇండియా ఓ విలాసవంతమైన మేడ్ ఇన్ జర్మనీ క్లాసిక్ క్రోనోగ్రాఫ్ చేతి ఘడియారాన్ని అలాగే ఆడి ఆర్8 వి10 మోడల్‌ను పోలి ఉండే ఓ పెన్‌డ్రైవ్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసినదే.

Audi Mouse

More from DriveSpark

Article Published On: Thursday, June 13, 2013, 16:37 [IST]
English summary
German luxury maker Audi India has launched a computer mouse in the shape of its vehicle. The mouse is priced at Rs. 5,559.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+