భారత్‌లో గో హ్యాచ్‌బ్యాక్ టెస్టింగ్‌ను స్టార్ట్ చేసిన డాట్సన్

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఈ ఏడాది జులై నెలలో తొలిసారిగా ఆవిష్కరించిన తమ 'డాట్సన్ గో' (Datsun GO) హ్యాచ్‌బ్యాక్ కారును వీలైనంత త్వరగా, భారత మార్కెట్లో వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. కంపెనీ ఇప్పటికే ఈ చిన్న కారును ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ కూడా చేస్తోంది.

జులై 15, 2013న దేశ రాజదాని ఢిల్లీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో డాట్సన్ బ్రాండ్ క్రింద తొలి ఉత్పత్తిని నిస్సాన్ ఇండియా సీఈఓ కార్లోస్ ఘోస్న్ ఆవిష్కరించారు. టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన స్పై చిత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్నాయ. నిస్సాన్ అందిస్తున్న చిన్న కారు మైక్రా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని డాట్సన్ గో కారును అభివృద్ధి చేశారు. మరిన్ని వివరాలు, డాట్సన్ గో స్పై చిత్రాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇది కూడా చదవండి: డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి ఆవిష్కరణ; 2014లో విడుదల

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన డాట్సన్ గో

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన డాట్సన్ గో

మైక్రాలో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో కారులోను ఉపయోగించారు (పవర్, పెర్ఫామెన్స్ వివరాలు వెల్లడించలేదు). ఈ కారును పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నారు.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి

భవిష్యత్తులో డాట్సన్ గో ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని మరిన్ని కార్లను తయారు చేయనున్నారు. అందులో ఒకటి ఈ డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి.

5-సీటర్ హ్యాచ్‌బ్యాక్

5-సీటర్ హ్యాచ్‌బ్యాక్

ధృడత్వం, సౌకర్యం, మైలేజ్ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని డాట్సన్ గో కారును తయారు చేశారు. ఇదొక 5-సీటర్ హ్యాచ్‌బ్యాక్.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

ఇందులో కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ గేర్‌బాక్స్‌ను డ్యాష్ బోర్డుకే జతచేయబడి ఉంటుంది. ఫలితంగా ఫ్రంట్ డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్లు కలుపబడినట్లుగా ఉండి, ముందు వైపు ఎక్కువ ఇంటీరియర్ స్పేస్ లభిస్తుంది.

మొబైల్ డాకింగ్ స్టేషన్‌

మొబైల్ డాకింగ్ స్టేషన్‌

ఇంకా ఇందులో మొబైల్ డాకింగ్ స్టేషన్‌ను కూడా జోడించారు. ఈ ఫీచర్ సాయంతో కస్టమర్లు తమ స్మార్ట్‌‌ఫోన్లతో కారుకు కనెక్ట్ కావచ్చు.

ధర

ధర

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం డాట్సన్ గో చిన్న కారు ధర రూ.4 లక్షలకు దిగువనే ఉండనుంది.

2014లో విడుదల

2014లో విడుదల

2014 ఆరంభంలో ఇది వాణిజ్య పరంగా దేశీయ విపణిలో లభ్యం కానుంది.

డాట్సన్ గో టెస్టింగ్

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్.

ఫొటో మూలం: టీమ్ బిహెచ్‌పి
డాట్సన్ గో టెస్టింగ్

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్.

ఫొటో మూలం: టీమ్ బిహెచ్‌పి

More from DriveSpark

Article Published On: Monday, October 28, 2013, 15:32 [IST]
English summary
Japanese carmaker Nissan’s low-cost brand Datsun, which was unveiled on July 15, 2013 in Delhi has already started testing its first hatchback GO on Indian roads.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+