మీరు నిస్సాన్ టెర్రానో టెలివిజన్ ప్రకటనను చూశారా?
నిస్సాన్ ఇండియా ఈనెల 9వ తేదీన తమ అధునాతన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నిస్సాన్ టెర్రానో'ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, తాజాగా నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ కోసం రూపొందించిన ఓ టెలివిజన్ కమర్షియల్‌ను నిస్సాన్ ఇండియా ఇంటర్నెట్లో విడుదల చేసింది. ఈ ప్రకటన థీమ్ వీక్షకులను ఆకట్టుకుంటుంది (ఈ ప్రకటనను క్రింది వీడిలో వీక్షించవచ్చు).
ఇది కూడా చదవండి: నిస్సాన్ టెర్రానో టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్
ఇక నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ విషయానికి వస్తే, దేశీయ విపణిలో దీని ప్రారంభ ధరను రూ.9.58 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. రెనో డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ మోడల్, డస్టర్ మాదిరిగానే 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ (104 పిఎస్) మరియు 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్ (రెండు విభిన్న ట్యూనింగ్‌లతో - 85 పిఎస్, 110 పిఎస్) ఆప్షన్లతో లభిస్తుంది.

అన్ని వేరియంట్లు (110 పిఎస్ డీజిల్ మినహా) 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. 110 పిఎస్ డీజిల్ వెర్షన్ మాత్రం 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ అందుబాటులో లేదు.
నిస్సాన్ టెర్రానో టెలివిజన్ కమర్షియల్ వీడియో
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/qQPHwxmLIwo?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








