హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్‌లో ఫియట్ మల్టీజెట్ ఇంజన్!

By Ravi

భారతదేశపు అతి పురాతన ఆటోమొబైల్ కంపెనీ హిందుస్థాన్ మోటార్స్ అందిస్తున్న ఏకైక కారు 'అంబాసిడర్' కోసం కంపెనీ ఇప్పుడు కొత్త ఫియట్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఫియట్ నుంచి అత్యంత పాపులర్ అయిన 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను ఇప్పటికే అనేక కార్లలో (లీనియా, పుంటో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, విస్టా, ఇండికా, ఇండిగో, ప్రీమియర్ రియో, సెయిల్, ఎంజాయ్) ఈ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, హిందుస్థాన్ మోటార్స్ కూడా తమ ప్రస్తుత అంబాసిడర్ కారు లోను అలాగే భవిష్యత్తులో విడుదల చేయనున్న కాంపాక్ట్ అంబాసిడర్ కారులోను ఈ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. హిందుస్థాన్ మోటార్స్ ఇటీవలే బిఎస్4 వెర్షన్ 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌తో కూడిన కొత్త అంబాసిడర్ ఎన్‌కోర్‌ను విడుదల చేసినప్పటికీ, కంపెనీ అమ్మకాలు పుంజుకోలేదు. దీంతో హిందుస్థాన్ మోటార్స్ తమ అంబాసిడర్‌ను యాంత్రిక పరంగా అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది.

ఇది కూడా చదవండి: అంబాసిడర్ ఎన్‌కోర్ విడుదల

Hindustan Motors To Source Fiat MultiJet Engines For Ambassador

అయితే, హిందుస్థాన్ మోటార్స్‌కు ఇప్పటికిప్పుడు కొత్త ఇంజన్‌ను తయారు చేయటం అంత సాధ్యమైన పని కాదు. అందుకే, ఫియట్ నుంచి పాపులర్ అయిన ఈ ఇంజన్‌ను తమ కార్లలో అమర్చితే, ఫలితం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. ఇదే విషయాన్ని ధృవీకరించేందుకు కంపెనీ యాజమాన్యం నిరాకరిస్తోంది. ఏదేమైనప్పటి, ఈ విషయంలో త్వరోలనే ఓ స్పష్టమైన నిర్ణయం వెలువడే ఆస్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఫియట్ అందిస్తున్న ఈ పాపులర్ 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్ మంచి పెర్ఫామెన్స్‌తో పాటుగా మెరుగైన మైలేజీని కూడా ఆఫర్ చేస్తుంది. అందుకే ఈ ఇంజన్‌కు అంత పాపులారిటీ లభించింది. హిందుస్థాన్ మోటార్స్ నుంచి రానున్న కొత్త కాంపాక్ట్ అంబాసిడర్ కారులో ఈ ఇంజన్‌ను ఉపయోగించినట్లయితే, దీనిని కేవలం టాక్సీ ప్రయోజనం కోసమే కాకుండా, పర్సనల్ యుటిలిటీ కోసం కూడా కొనుగోలుదారులు సొంతం చేసుకునే ఆస్కారం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 3, 2013, 15:35 [IST]
English summary
HM Ambassador compact car with Fiat multijet engine launch in 2014. HM Ambassador sub-4 meter compact sedan powered by Fiat Multijet engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+