లాంబోర్గినీ గల్లార్డోకు సక్సెసర్‌గా వస్తున్న లాంబోర్గినీ హారికేన్

By Ravi

ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గినీ ఇటీవలే తమ పాపులర్ గల్లార్డో ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి తెలిసినదే. లాంబోర్గినీ 2003లో తొలిసారిగా ప్రవేశపెట్టిన గల్లార్డో మోడల్‌ను ఇప్పటి వరకూ 14022 మోడళ్లను కంపెనీ విక్రయించింది. గడచిన నవంబర్ నెలలో కంపెనీ తమ 14022వ గల్లార్డో మోడల్‌ను తయారు చేసి, ఇదే తమ చివరి గల్లార్డో, ఇకపై గల్లార్డోను ఉత్పత్తి చేయబోమని ప్రకటించింది.

ఇది కూడా చదవండి: లాంబోర్గినీ గల్లార్డో శకం ముగిసింది; ఇదే చివరి కారు

అయితే, లాంబోర్గినీ గల్లార్డో మోడల్‌కు సక్సెసర్‌గా మరో సరికొత్త మోడల్ వస్తుంది కంపెనీ పేర్కొంది. తాజా అప్‌డేట్ ప్రకారం, లాంబోర్గినీ ఇప్పటికే గల్లార్డో స్థానాన్ని భర్తీ చేసేందుకు ఓ సరికొత్త సూపర్‌ను తమ ఆర్ అండ్ డి కేంద్రంలో అభివృద్ధి చేస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, లాంబోర్గినీ గల్లార్డోకు సక్సెసర్‌గా వస్తున్న ఈ కొత్త మోడల్‌ను 'లాంబోర్గినీ హారికేన్' (Lamborghini Huracan) అని పిలువనున్నారట.

Lamborghini Huracan

లాంబోర్గినీ ఏప్రిల్ 2012లో తమ యూరస్ ఎస్‌యూవీ పేరుతో పాటుగా హారికేన్ పేరును కూడా పేటెంట్ చేయించుకుంది. సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకోనున్న లాంబోర్గినీ హారికేన్ సూపర్‌కారులో రీట్యూన్డ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. దీని తయారీలో ఎక్కువ మోతాదులో కార్భన్ ఫైబర్, అల్యూమినియం పధార్థాలను వాడనున్నారు. హారికేన్ మొత్తం బరువును 1500 కేజీల కన్నా తక్కువగా ఉంచేందుకు ఇంజనీర్లు కృషి చేస్తున్నారు.

ప్రస్తుతం లాంబోర్గినీ ఉపయోగిస్తున్న 5.2 లీటర్, వి10 ఇంజన్‌నే రీట్యూన్ చేసి, 600 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసేలా అప్‌గ్రేడ్ చేసి లాంబోర్గినీ హారికేన్‌లో అమర్చనున్నట్లు సమాచారం. గేర్‌‌బాక్ ఆప్షన్స్ విషయానికి వస్తే, స్డాండర్డ్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డబుల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లను ఉపయోగించే ఆస్కారం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి. ఈలోపుగా లాంబోర్గినీ విడుదల ఈ మిస్టీరియస్ టీజర్ వీడియోని వీక్షించండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/9BUcKL76mVY?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, December 16, 2013, 9:30 [IST]
English summary
The successor to the Lamborghini Gallardo will be called Huracan. While Lamborghini is yet to officially come out with the name, which will most likely be before the end of this year, the folks over at AutoExpress have already stumbled upon the name with the help of insider sources.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+