లాంబోర్గినీ గల్లార్డో శకం ముగిసింది; ఇదే చివరి కారు
సూపర్‌కార్ ప్రియులకు షాకింగ్ న్యూస్..! ఇంతకాలం స్పోర్ట్స్ కార్ ప్రియులను అలరించిన లాంబోర్గినీ గల్లార్డో ఇక చరిత్రలో కలిసిపోనుంది. గల్లార్డో సూపర్‌కరు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. లాంబోర్గినీ గల్లార్డో మొత్తం జీవితం కాలం కేవలం 10 ఏళ్లు మాత్రమే.
లాంబోర్గినీ కార్ల తయారీకి బీజం ఎలా పడిందో తెలుసా?
ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గినీ తొలిసారిగా 2003లో తమ గల్లార్డో కారును ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రారంభంలో లాంబోర్గినీ ఏటా 250 యూనిట్ల గల్లార్డో కార్లను ఉత్పత్తి చేసేది. అయితే, ఈ మోడల్‌కు డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని సాలీనా 2000 యూనిట్లకు పెంచింది.

లాంబోర్గినీ 1963 నుంచి ఇప్పటి వరకు సుమారు 30,000 కార్లకు పైగా విక్రయిస్తే, అందులో 14,022 కార్లు గల్లార్డో మోడళ్లే ఉన్నాయంటేనే, ఈ మోడల్ ఎంతటి గొప్ప సక్సెస్‌ను సాధించిందో ఇట్టే అర్థమైపోతుంది. ఈ సందర్భంగా, చివరిగా ఉత్పత్తి చేసిన 14,022వ లాంబోర్గినీ గల్లార్డో కారును కంపెనీ తమ ప్లాంట్ నుంచి విడుదల చేసింది. గల్లార్డో సిరీస్‌లో ఇదే చివరి కారు.
వచ్చే ఏడాదిలో లాంబోర్గినీ గల్లార్డో రీప్లేస్‌మెంట్
లాంబోర్గినీ గల్లార్డో కారులో 5.2 లీటర్ వి10 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇకపై లాంబోర్గినీ గల్లార్డో కార్లను ఉత్పత్తి చేయబోదు. అయితే, గల్లార్డో స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు లాంబోర్గినీ ఓ సరికొత్త సూపర్‌కారును పరిచయం చేసే అవకాశం ఉంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, లాంబోర్గినీ స్థానంలో రానున్న కొత్త సూపర్‌కారుకు కాబ్రెరా అనే పేరును పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. లాంబోర్గినీ తమ సంస్థను ప్రారంభించి 50 ఏళ్లను పూర్తి చేసుకొని 51వ వసంతంలోకి అడుగుపెట్టింది.


Click it and Unblock the Notifications








