రూ.20,000 డౌన్ పేమెంట్‌కే టాటా నానో

By Ravi

ఈ డిసెంబర్ నెలలో టాటా నానో కారును కొనుగోలు చేస్తున్నారా..? అయితే, మీ డీలరు వద్ద బేరమాడండి, మంచి డీల్ దొరుకుతుంది. ఏడాది ముగింపు అమ్మకాల్లో భాగంగా, దాదాపు అన్ని కార్ కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను, వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇదే కోవలో, టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు 'టాటా నానో'పై మంచి డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు డీలర్లు.

కేవలం రూ.20,000 డౌన్‌పేమెంట్ చెల్లించి, టాటా నానో కారును ఇంటికి తీసుకువెళ్లవచ్చు. మిగిలిన మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించకుంటే సరిపోతుంది. అంతేకాకుండా, ఈ నెలాఖరు లోపుగా టాటా నానో కారును కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ.55,000 వరకు విలువైన ప్రయోజనాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో అధీకృత టాటా మోటార్స్ డీలరును సంప్రదించండి.

Tata Nano Offer

ఇక టాటా నానో విషయానికి వస్తే.. ఇది ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, భారత్‌లోనే అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కారు. ఇది లీటరు పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. బెస్ట్-ఇన్-క్లాస్ ఎయిర్ కండిషన్, విశాలమైన ఇంటీరియర్స్ కలిగిన టాటా నానో 4 ఏళ్లు లేదా 60,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది (ఏది ముందుగా ముగిస్తే అది).

స్టాండర్డ్ స్మాల్ కారుతో పోల్చుకుంటే టాటా నానో 21 శాతం అధిక ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. టాటా నానో టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ (4 మీటర్లు మాత్రమే). ఇందులో 624సీసీ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదిలా ఉండగా.. టాటా నానో ట్విస్ట్ పేరిట ఓ పవర్ స్టీరింగ్ వెర్షన్‌ను టాటా మోటార్స్ వచ్చే నెలలో విడుదల చేయనుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 20, 2013, 14:31 [IST]
English summary
The Tata Nano is getting more affordable at least in terms of down payment. Tata Motors is offering the small car with a down payment of just Rs.20,000 along with a low interest rates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+