జనవరి 2014 నుంచి పెరగనున్న మహీంద్రా కార్ల ధరలు
మహీంద్రా కార్లు కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే, కొత్త సంవత్సరంలో మహీంద్రా కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. జనవరి 2014లో మహీంద్రా కారు కొనాలనుకునే వారు అధిక ధరను చెల్లించాల్సి ఉంటుంది. అదే డిసెంబర్ 2013 నెలలో మహీంద్రా కారును కొనేవారు ఎక్కువ ప్రయోజనాలను పొందటమే కాకుండా, మంచి ఆదా కూడా చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: డిసెంబర్ 2013 ఆఫర్స్; మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్
డిసెంబర్ నెలలో మహీంద్రా కార్లను కొనుగోలుచేసే కస్టమర్లకు కంపెనీ భారీ తగ్గింపులను, ప్రోత్సాహకాలను అందిస్తుంది. అధిక ఉత్పత్తి వ్యయాల ప్రభావాన్ని తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా తెలిపారు.
జనవరి 2014 నుంచి ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల ధరలను 1 శాతం నుంచి 2 శాతం మేర పెంచుతామని చెప్పారు. అయితే, ఏయో మోడళ్లపై ఎంత మేర ధరలు పెంచనున్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
కాగా.. ఇప్పటికే జనవరి 2014 కార్ల ధరలను పెంచనున్నట్లు నిస్సాన్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా, రెనో ఇండియా కంపెనీలతో పాటుగా బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, ఆడి ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా కంపెనీలు కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications









