కొత్త ఆక్టావియా రాకతో మార్కెట్ నుంచి తొలగిపోనున్న లారా

By Ravi

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా, తాజాగా దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన ప్రీమియం సెడాన్ ఆక్టావియా హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ధరకు తగిన విలువ, సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో లభ్యమవుతున్న 2013 స్కొడా ఆక్టావియాకు ఇప్పటికే 500 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయని స్కోడా ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ రావు తెలిపారు.

కొత్త 2013 ఆక్టావియా రాకతో ప్రస్తుతం తాము మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం సెడాన్ స్కొడా లారాను త్వరలోనే క్రమంగా మార్కెట్ నుంచి ఉపసంహరిస్తామని, అయితే ఆర్డర్లపై ఈ మోడల్‌ను అందించే అవకాశముందని ఆయన వివరించారు. కాగా.. భారత మార్కెట్లో కొత్త ఆక్టావియా పెట్రోల్ వెర్షన్ ధరలు రూ.13.95 లక్షల నుంచి రూ.18.25 లక్షల రేంజ్‌లోను మరియు ఆక్టావియా డీజిల్ వెర్షన్ ధరలు రూ.15.55 లక్షల నుచి రూ.19.45 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఇది కూడా చదవండి: 2013 స్కొడా ఆక్టావియా రివ్యూ


ఇదిలా ఉండగా, త్వరలోనే చిన్న కారును (బహుశా ఫ్యాబియా స్థానంలో ఓ కొత్త కారు) కూడా భారత మార్కెట్లోకి తెస్తామని సుధీర్ రావు చెప్పారు. స్కొడా ఇండియా తొలిసారిగా తమ ఆక్టావియా సెడాన్ కారును 2001లో మార్కెట్లో విడుదల చేసింది. ఆ తర్వాత దీని అమ్మకాలు ఆశించిన రీతిలో సాగకపోవటంతో, కంపెనీ ఈ మోడల్‌ ఉత్పత్తిని నిలిపివేసింది. 2010 వరకూ సుమారు 45 వేల ఆక్టావియా కార్లను కంపెనీ విక్రయించింది. తాజాగా అప్‌గ్రేడ్ అయి వచ్చిన కొత్త ఆక్టావియా మంచి ఫలితాలనిస్తుందని స్కొడా ఆశిస్తోంది.
Skoda Laura

More from DriveSpark

Article Published On: Friday, October 4, 2013, 11:21 [IST]
English summary
The all new Skoda Octavia has arrived. The replacement for the Laura will be available for a starting price of INR 13.9 lakhs. The launch of the new Octavia is a significant one since its the first car in India that's built on VW's MQB platform.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+