అనధికారికంగా 2014 హోండా సిటీ బుకింగ్స్ ఓపెన్!

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈనెల 25న తమ కొత్త తరం 2014 హోండా సిటీ సెడాన్‌ (కోడ్‌‌నేమ్: 2సిటి)ను ఆవిష్కరించనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, సరికొత్త హోండా సిటీ సెడాన్ కోసం ఇప్పటికే కొందరు డీలర్లు అనధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: 2014 హోండా బైక్స్

సదరు డీలర్లు కస్టమర్ల నుంచ రూ.50,000-1,00,000 అడ్వాన్సును స్వీకరించి, బుకింగ్‌లను అంగీకరిస్తున్నట్లు మార్కెట్ వర్గాల నుంచి అందిన సమాచారం. కారు విడుదల కాక ముందు, దాని డిజైన్ ఎలా ఉంటుందో తెలియక ముందే కొనుగోలుదారులు కొత్త సిటీ సెడాన్‌ను బుక్ చేసుకోవటం విశేషం. కాగా. హోండా కార్స్ ఇండియా దేశీయ విపణిలో ఇప్పటికే ప్రస్తుత సిటీ సెడాన్ ఉత్పత్తిని నిలిపి వేసింది.

2014 Honda City

హోండా నుంచి వస్తున్న ఈ కొత్త తరం సిటీ సెడాన్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 25, 2013న న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో కొత్త హోండా సిటీ సెడాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ మోడల్ గ్లోబల్ ఆవిష్కరణకు కూడా ఇదే వేదిక కానుంది. ఇదిలా ఉండగా, కొత్త సిటీ సెడాన్ మార్కెట్లోకి వచ్చే లోపుగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సిటీ సెడాన్ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు డీలర్లు ఈ పాత మోడల్‌పై భారీ తగ్గింపులను కూడా ఆఫర్ చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 14, 2013, 10:05 [IST]
English summary
Honda's next gen City sedan will be unveiled in New Delhi on 25th November 2013. There are reports that suggest that some Honda dealers across India have started unofficial bookings by taking an amount of Rs. 50,000-100,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+