నిస్సాన్ టెర్రానోకి 6000 బుకింగ్స్; 2 నెలల వెయిటింగ్ పీరియడ్
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీకి ఇప్పటికే 6,000 యూనిట్లకు పైగా ముందస్తు బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ పేర్కొంది. నిస్సాన్ ఇండియా గడచిన సెప్టెంబర్ 1వ తేది నుంచే నిస్సాన్ టెర్రానో కోసం ముందస్తు బుకింగ్‌లను స్వీకరించటం ప్రారంభించింది.నిస్సాన్ డీలర్లు కేవలం రూ.50,000 అడ్వాన్సు మొత్తానికే బుకింగ్‌లను స్వీకరించడంతో, దీనిని సొంతం చేసుకోవాలనుకునే వారి సంఖ్య 6,000 లను దాటిపోయింది.
ప్రస్తుతం నిస్సాన్ ఇండియా, చెన్నైలోని తమ ఓరగడం ప్లాంట్‌లో నెలకు 3,000 టెర్రానో ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా, టెర్రానో వెయింటింగ్ పీరియడ్ కూడా పెరుగుతోంది. టెర్రానో ఉత్పత్తి, డిమాండ్ పొజిషన్‌ను చూస్తే, దీని వెయింటింగ్ పీరియడ్ 2 నెలలకుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, టెర్రానోకి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇది కూడా చదవండి: నిస్సాన్ టెర్రానో టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్
నిస్సాన్ ఇండియా కేవలం రూ.9.58 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే టెర్రానో ఎస్‌యూవీని విక్రయిస్తోంది. ఇది 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ (104 పిఎస్) మరియు 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్ (రెండు విభిన్న ట్యూనింగ్‌లతో - 85 పిఎస్, 110 పిఎస్) ఆప్షన్లతో మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది. అన్ని వేరియంట్లు (110 పిఎస్ డీజిల్ మినహా) 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. 110 పిఎస్ డీజిల్ వెర్షన్ మాత్రం 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.


Click it and Unblock the Notifications









