అక్టోబర్ 9న నిస్సాన్ టెర్రానో కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల

ఇప్పటి వరకు కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రియులను ఊరిస్తూ వచ్చిన నిస్సాన్ టెర్రానో, రేపు (అక్టోబర్ 9, 2013)న వాణిజ్య పరంగా భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే పాపులర్ అయిన రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మోడళ్లకు నిస్సాన్ టెర్రానో గట్టి పోటీగా నిలువనుంది.

నిస్సాన్ టెర్రానో కాంపాక్ట్ ఎస్‌యూవీని, రెనో అందిస్తున్న సక్సెస్‌ఫుల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డస్టర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసినప్పటికీ డిజైన్, ఫీచర్ల పరంగా చూస్తే, ఇది డస్టర్ కన్నా చాలా భిన్నంగా కనిపిస్తుంది. అయితే, యాంత్రికంగా మాత్రం రెండూ ఒకే రకమైన ఇంజన్లను కలిగి ఉంటాయి.

ఇది కూడా చదవండి: నిస్సాన్ టెర్రానో సమీక్ష

Nissan Terrano SUV

రెనో డస్టర్ మాదిరిగానే నిస్సాన్ టెర్రానో కూడా 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ కె9కె టర్బో డీజిల్ ఇంజన్ రెండు విభిన్న ట్యూనింగ్‌లతో (85 పిఎస్, 110 పిఎస్) లభిస్తుంది. ఈ ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ అందుబాటులో లేదు.

నిస్సాన్ టెర్రాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అంచనా ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
* టెర్రానో ఎక్స్‌ఎల్ (1.6 లీటర్ పెట్రోల్) - రూ.8.39 లక్షలు
* టెర్రానో ఎక్స్ఈ (85 పిఎస్ డీజిల్) - రూ.9.15 లక్షలు
* టెర్రానో ఎక్స్ఎల్ ప్లస్ (85 పిఎస్ డీజిల్) - రూ.11.66 లక్షలు
* టెర్రానో ఎక్స్ఎల్ ప్లస్ (110 పిఎస్ డీజిల్) - రూ.11.15 లక్షలు
* టెర్రానో ఎక్స్‌వి ప్రీమియం (110 పిఎస్ డీజిల్) - రూ.12.83 లక్షలు
(అన్ని అంచనా ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

గమనిక: పైన పేర్కొన్నవి అంచనా ధరలు మాత్రమే, ఖచ్ఛితమైన ధర మరియు ఇతర వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 8, 2013, 15:04 [IST]
English summary
Japanese carmaker Nissan India is all set to launch its new compact SUV, the Terrano on 9th October 2013. Stay tuned to www.drivespark.com for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+