నిస్సాన్ టెర్రానో యాక్ససరీస్: ఆప్షనల్ థర్డ్ రో సీట్
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ కోసం కంపెనీ విస్తృత స్థాయి యాక్ససరీలను అందుబాటులోకి తీసుకవచ్చింది. ఇప్పుడు వినియోగదారులు తమ టెర్రానో ఇంటీరియర్, ఎక్స్టీరియర్లను తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ యాక్ససరీస్‌లో ప్రధనంగా చెప్పుకోదగిన థర్డ్ రో సీట్ (7 సీటర్) ఆప్షన్.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నిస్సాన్ టెర్రానో రెండు వరుసల (2 రో) సీట్లతో, డ్రైవరుతో కలిపి ఐదుగురు (2+3) ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా సీటింగ్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. మూడవ వరుసలో సీట్లు లేకుండా లగేజ్ స్పేస్ (475 లీటర్ల బూట్ స్పేస్) విశాలమైన స్థలాన్ని కేటాయించారు. అయితే, అధిక బూట్ స్పేస్ అవసరం లేదనుకునేవారు లేదా ఐదుగురు కన్నా ఎక్కువ మంది ప్రయాణించాలనుకునే వారు ఇప్పుడు తమ టెర్రానో థర్డ్ రో సీట్లను జోడించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: నిస్సాన్ టెర్రానో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, రివ్యూ
ఈ మేరకు నిస్సాన్ యాక్ససరీస్ అందుబాటులో ఉన్నాయి. మూడవ వరుసలో ఎదురెదురుగా ఉండే రెండు ఫోల్డబిల్ సీట్లను కస్టమర్లు అదనంగా ఫిట్ చేయించుకోవచ్చు. అవసరం లేదనుకున్నప్పుడు ఈ సీట్లను పైవైపుకు మడచిపెట్టి, ఆ స్థలాన్ని లగేజ్ కోసం వాడుకోవచ్చు. కానీ ఈ థర్డ్ రో సీట్స్ పెద్దవారికి అంత సౌకర్యంగా అనిపించవు. చిన్న పిల్లలకు అయితే, ఇవి చక్కగా సరిపోతాయి.


Click it and Unblock the Notifications









