రీకాల్ హోరు: ఫోర్డ్ ఈకోస్పోర్ట్ పెట్రోల్ వెర్షన్ డిమాండ్ జోరు

By Ravi

అమెరికన్ హాట్ బ్యూటీ, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ డీజిల్ వెర్షన్లలో గ్లో పగ్ మాడ్యూల్ (glow plug module) సమస్య కారణంగా, కంపెనీ విక్రయించిన అన్ని డీజిల్ వేరియంట్లను ఫోర్డ్ ఇండియా రీకాల్ చేసిన సంగతి తెలిసినదే. డీజిల్ వెర్షన్లలో ఈ సమస్య ఇంకా పూర్థిస్థాయిలో పరిష్కారం అయినట్ల కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, డీజిల్ వెర్షన్‌ను కొనాలనుకునే కస్టమర్లు కూడా పెట్రోల్ వెర్షన్ వైపే మొగ్గు చూపుతున్నారు.

ఈ పరిస్థితులతో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ పెట్రోల్ వెర్షన్లకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీంతో పెట్రోల్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్ కూడా గరిష్టంగా పెరిగిపోయింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్ 9 నెలలకు పైగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే, డీజిల్ వేరియంట్ల కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నది లేదని ఇంకా స్పష్టం తెలియరాలేదు. ఏదేమైనప్పటికీ, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ డీజిల్ వేరియంట్లో సమస్యలు ఉన్నాయని తెలియగానే పెట్రోల్ వేరియంట్లకు డిమాండ్ జోరందుకుంది.


ఫోర్డ్ ఈకోస్పోర్ట్ డీజిల్ వేరియంట్లో గ్లో ప్లగ్ మాడ్యూల్ సమస్య కారణంగా 972 యూనిట్ల డీజిల్ ఈకోస్పోర్ట్ కార్లను రీకాల్ చేసిన సంగతి తెలిసినదే. రోటీన్ చెక్‌లలో భాగంగా ఈకోస్పోర్ట్ డీజిల్ వేరియంట్లలో గ్లోబ్ మాడ్యూల్‌కు సంబంధించిన సమస్యలను గుర్తించామని, ఈ మాడ్యూల్‌ను రీలొకేట్ చేయాల్సిన అవసరం ఉందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విషయానికి వస్తే, ఇది మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. అందులో ఒకటి 1.5 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 112 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది.

Ford EcoSport Rear

డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్, 4-సిలిండర్ డీజిల్ గరిష్టంగా 91 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

టాప్-ఎండ్ పెట్రోల్ వేరియంట్ ఈకోస్పోర్ట్‌ మాత్రం 1.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 125 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో కూడా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

More from DriveSpark

Article Published On: Monday, August 5, 2013, 17:15 [IST]
English summary
The Ford EcoSport compact SUV petrol versions waiting period has gone up by nearly nine months depending on the variant. This is mainly because the diesel versions recall issue.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+