ఆగస్టులో భారత్‌కు రానున్న రోల్స్ రాయిస్ వ్రైత్
రోల్స్ రాయిస్ వ్రైత్ (Rolls Royce Wraith) గుర్తుందా..? గడచిన మార్చ్ నెలలో జరిగిన 83వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ ఆవిష్కరించిన హై-పెర్ఫామెన్స్ కారు భారత్‌లో కూడా సందడి చేయనుంది. ఈ కాస్ట్లీ కారు వచ్చే నెలలో భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇది రోల్స్ రాయిస్ నుంచి లభ్యం కానున్న అత్యంత శక్తివంతమైన కారు.
రోల్స్ రాయిస్ నుండి అత్యంత పాపులర్ అయిన లగ్జరీ సెడాన్ 'ఘోస్ట్' ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ 'వ్రైత్'ను అభివృద్ధి చేసింది. రోల్స్ రాయిస్ వ్రైత్‌లో 6.6 లీటర్, వి12, ట్విన్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 624 పిఎస్‌ల శక్తిని, 800ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.2 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
రోల్స్ రాయిస్ వ్రైత్ గరిష్ట వేగాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, రోల్స్ రాయిస్ ఇప్పటి వరకూ విడుదల చేసిన కార్లలో కెల్లా ఇదే అత్యంత వేగవంతమైన కారు అనే విషయాన్ని మాత్రం కంపెనీ తెలిపింది. దీని ధర 3,20,000 డాలర్లు లేదా రూ.1.75 కోట్లు (పన్నులు కలుపుకోకుండా) ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.
రోల్స్ రాయిస్ వ్రైత్ ఫొటోల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.



Click it and Unblock the Notifications








