ముంబై: డ్రైవింగ్ సేఫ్టీ క్యాంపైన్‌ను ప్రారంభించిన స్కొడా ఇండియా

By Ravi

Drink Drive
ప్రస్తుతం దేశమంతంటా ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫీవర్ నెలకొన్ని ఉన్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ముంబైలోని స్కొడా కార్ల వినియోగదారుల కోసం స్కొడా ఆటో ఇండియా ఓ సరికొత్త క్యాంపైన్‌ను నిర్వహిస్తోంది. ఈ క్యాంపైన్‌లో భాగంగా, ఫుల్లుగా పీకల వరకూ మందుకొట్టి పడిపోయే స్కొడా యజమానులు ఒక్క ఫోన్ కాల్ కొడితే, స్కొడా ప్రతినిధులే స్వయంగా వచ్చి సదరు యజమానులను సురక్షితంగా వారి ఇళ్లకు కారుతో సహా చేరవేస్తారు.

గడచిన సంవత్సరంలో కూడా స్కొడా ఆటో ఇండియా ఈ క్యాంపైన్‌ను ప్రారంభించింది. గడచిన ఐపిఎల్ సీజన్‌లో ఇది మంచి విజయం సాధించటంతో ప్రస్తుత సీజన్‌లో కంపెనీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మద్యం సేవించి డ్రైవ్ చేసే వారిలో అవగాహన తీసుకువచ్చేందుకు మరియు అలాంటి వారిని సురక్షితంగా వారి వారి స్వగృహాలకు చేర్చేందుకు 'ఒకవేళ మీరు తాగినట్లయితే, మేము డ్రైవ్ చేస్తాం' (ఇఫ్ యూ డ్రింక్ వుయ్ డ్రైవ్) అనే ఓ సరికొత్త ప్రణాళికతో స్కొడా ముందుకు వచ్చింది.

ఇందులో భాగంగా, మద్యం సేవించి కారు నడపలేని స్థితిలో ఉన్న తమ కస్టమర్లను స్కొడా ఇండియా క్షేమంగా వారి ఇంటికి చేర్చుతుంది. ఇందుకు స్కొడా కస్టమర్లు చేయాల్సిందల్లా కంపెనీ ఇచ్చిన హెల్ప్‌లైన్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయటమే. ప్రస్తుతానికి ఈ ఆఫర్ కేవలం ముంబై వాసులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సర్వీస్ కేవలం స్కొడా కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇది మే 2015 వరకూ మాత్రమే అమల్లో ఉంటుంది. ఇదిలా ఉండగా, ఈ సమ్మర్ సీజన్‌లో స్కొడా తమ వినియోగదారుల కోసం ఉచిత సర్వీస్ క్యాంప్‌ను అందిస్తున్న సంగతి తెలిసినదే.

More from DriveSpark

Article Published On: Monday, April 15, 2013, 14:47 [IST]
English summary
Skoda India has launched a unique service for its Mumbai customers called 'If You Drink, We Drive'. This service is aimed to provide publicity to responsible driving without missing out the fun of life. Skoda hopes this service will help improve the safety of its customers and reduce accidents.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+