టాటా ఇండికా విస్టా డి90 కథ ముగిసిపోయినట్లేనా?

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ ఏడాది జనవరి నెలలో విడుదల చేసిన పవర్‌ఫుల్ 'విస్టా డి90' కారు కథ కంచికి చేరినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఏడాది తిరగకముందే ఈ కారును మార్కెట్ నుంచి తొలగించాలని టాటా మోటార్స్ యోచిస్తోంది. కార్‌టాక్‌లో ప్రచురించిన ఓ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లు తమ వద్ద ఉన్న విస్టా డి90 స్టాక్‌ను క్లియర్ చేసుకుంటున్నారు.

అయితే, ఈ పవర్‌ఫుల్ టాటా ఇండికా విస్టా డి90 కారు మార్కెట్ నుంచి తొలగిపోయిందని చింతించాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఈ కారును రీప్లేస్ చేస్తూ మరో కొత్త మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ఈ కొత్త కారును ఆవిష్కరించే అవకాశం ఉంది. టాటా మోటార్స్ ఇప్పటికే ఫాల్కన్ పేరుతో రెండు కార్లను (ఫాల్కన్ 4 హ్యాచ్‌బ్యాక్, ఫాల్కన్ 5 సెడాన్) తయారు చేస్తున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.

Manza Hybrid

కాగా.. ఇందులో ఫాల్కన్ 4 హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుత విస్టా డి90 కారు స్థానాన్ని భర్తీ చేయనుండగా, ఫాల్కన్ 4 సెడాన్ మాంజా కారు స్థానాన్ని భర్తీ చేయనుంది. విస్టా డి90 కారు స్థానాన్ని భర్తీ చేయనున్న ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ కారును టాటా మోటార్స్‌కు చెందిన యూరోపియన్ డిజైన్ సెంటర్ డిజైన్ చేస్తోంది. టాటా మోటార్స్ 2012 ఇండియా ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మాంజా హైబ్రిడ్ కాన్సెప్ట్ డిజైన్ నుంచి కొన్ని ఫీచర్లను గ్రహించి ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా ఇండికా విస్టా డి90లో కారులో 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఫాల్కన్ 4 కారులో కూడా ఇదే ఇంజన్‌‌ను ఉపయోగిస్తారు. ఈ ఇంజన్‌ను గరిష్టంగా 90 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసేలా రీట్యూన్ చేయనున్నారు. వేరియబల్ జియోమెట్రీ టర్బోఛార్జర్ (విజిటి)తో కూడిన ఈ ఇంజన్ గరిష్టంగా 200 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఫాల్కన్ కార్లకు సంబంధించి మరింత సమాచారం తెలియాలంటే, ఫిబ్రవరి 2014 వరకు ఆగాల్సిందే.

More from DriveSpark

Article Published On: Thursday, December 12, 2013, 16:05 [IST]
English summary
Tata Motors has reportedly discontinued production of its premium hatchback model, the Vista D90. Launched about a year back in 2012, the D90 was marketed as a sporty version of the regular Indica Vista diesel hatch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+