ఈనెలలోనే క్యామ్రీ హైబ్రిడ్‌ను విడుదల చేయనున్న టొయోటా
హైబ్రిడ్ కార్ల తయారీలో ప్రపంచ అగ్రగామి కంపెనీ అయిన, జపనీస్ ఆటో దిగ్గజం టొయోటా భారత్‌లో మరొక కొత్త హైబ్రిడ్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.
టొయోటా అందిస్తున్న 'క్యామ్రీ' సెడాన్‌లో ఓ హైబ్రిడ్ వెర్షన్‌ను ఈనెలలోనే కంపెనీ విడుదల చేయనుంది. ప్రస్తుతం టొయోటా భారత మార్కెట్లో తమ ప్రియస్ హైబ్రిడ్ కారును మాత్రమే విక్రయిస్తోంది. రెగ్యులర్ వెర్షన్ క్యామ్రీ సెడాన్‌కు ఎగువన ఈ కారును ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండింటికీ వ్యత్యాసాన్ని చూపించే విధంగా హైబ్రిడ్ వెర్షన్ క్యామ్రీలో అనేక మార్పులు ఉండనున్నాయి.

ఈ మార్పులలో ప్రధానంగా, ఎక్స్టీరియర్స్‌లో విభిన్నమైన బంపర్, క్రోమ్ గ్రిల్, వెడల్పాటి ఎయిర్ డ్యామ్, క్రోమ్ ఇన్‌సెర్ట్‌తో కూడిన రీస్టయిల్డ్ ఫాగ్ ల్యాంప్స్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులను హైబ్రిడ్ క్యామ్రీలో చూడొచ్చు. ఇది హైబ్రిడ్ కారు అని తెలిపేందుకు గాను వెనుక వైపు 'హైబ్రిడ్ సైనర్జీ డ్రైవ్' అనే బ్లూ బ్యాడ్జ్ ఉంటుంది.
అలాగే, ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, త్రీ డయల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రీమియం సీట్ ఫ్యాబ్రిక్ వంటి ప్రధాన మార్పులను మనం గమనించవచ్చు.
ఈ హైబ్రిడ్ కారులో ఒక 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఒక 640 వోల్ట్స్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఈ ఇంజన్ ఈ-సివిటి (ఎలక్ట్రానికి కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 146 హెచ్‌పిల గరిష్ట శక్తిని, 187 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ మోటార్ 140 పిఎస్‌ల గరష్ట శక్తిని, 270 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 189 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
భారత మార్కెట్లో టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారు ధర రూ.35-36 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications









