గుర్గావ్‌లో ఆడి సెకండ్ హ్యాంక్ కార్ షోరూమ్ ప్రారంభం!

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, ఇప్పుడు దేశీయ విపణిలో కొత్త కార్లతో పాటుగా సెకండ్ హ్యాండ్ కార్లను కూడా విక్రయించనుంది. ఇందులో భాగంగా ఆడి ఇండియా దేశంలోనే తమ తొలి ప్రత్యేక ప్రీ-ఓన్డ్ లగ్జరీ కార్ షోరూమ్‌ను గుర్గావ్‌లో ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

'ఆడి అప్రూవ్డ్ ప్లస్' గుర్గావ్‌లో 26,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ అతిపెద్ద ప్రీ-ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) కార్ షోరూమ్‌ను ఆడి ఇండియా ప్రారంభించింది. ఈ ఆడి అప్రూవ్డ్ ప్లస్ గుర్గావ్ షోరూమ్‌లో ఏకంగా 33 ఆడి కార్లను పదర్శించేంత స్థలం ఉంది.


ఆడి కస్టమర్ల నుంచి కొనుగోలు చేసిన ఆడి కార్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి (110-పాయింట్ చెకప్) కండిషన్‌లో ఉన్న వాటినే విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. తాము కొనుగోలు చేసే కార్లలో మెకానికల్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, ఎలక్ట్రికల్స్ వంటి వాటిని తనిఖీ చేసి, అవసరమైతే మరమ్మత్తు చేసిన తర్వాత పూర్తి రోడ్ టెస్ట్ చేసి డిస్‌ప్లేలో ఉంచుతామని కంపెనీ వివరిచింది.

ఈ సెకండ్ హ్యాండ్ ఆడి లగ్జరీ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు రెండేళ్ల వారంటీని మరియు 24 గంటల రోడ్ సైట్ అసిస్టెన్స్‌ను కూడా అందిస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. గత రెండేళ్లుగా ఆడి అప్రూవ్డ్ ప్లస్ పేరిట దాదాపు ఐదు డీలర్‌షిప్‌ల ద్వారా సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తున్నామని, అయితే వీటి కోసం ఇలా ప్రత్యేక షోరూమ్‌ను ఏర్పాటు చేయటం ఇదే ప్రప్రథమం అని ఆడి ఇండియా హెడ్ జో కింగ్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 22, 2014, 16:01 [IST]
English summary
Audi India has opened a new pre-owned luxury car showroom, Audi Approved: Plus, in Gurgaon recently. Boasting a capacity of 33 cars on display and spread over an area of 26,000sqft. it’s the first standalone showroom for pre-owned cars opened by a luxury car maker in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+