బోష్ నుంచి మైడ్రైవ్అసిస్ట్ రోడ్ సైన్ యాప్ విడుదల

By Ravi

మనదేశంలో రోడ్ సైన్స్‌కు (రోడ్డు సంకేతాలు) మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వం, ఇక్కడ రోడ్ సైన్స్ అంటేనే ఓ పెద్ద జోక్‌గా ఉంటుంది. చాలా ప్రదేశాల్లో ఉండాల్సిన చోట రోడ్ సైన్స్ ఉండవు, ఎక్కడైనా రోడ్ సైన్స్ ఉన్నా వాటిని ఇష్టం వచ్చినట్లు పెడతారు. కొన్నిసార్లు ఈ రోడ్ సైన్స్ అర్థం కాకపోగా, గందరగోళానికి గురిచేస్తుంటాయి. అలాగే వాహనాలను నడిపే డ్రైవర్లు కూడా వీటిపై దృష్టి సారించరు.

ఇది కూడా చదవండి: తప్పనిసరి రోడ్డు సంకేతాలు

అయితే, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఈ రోడ్ సైన్స్‌ను డ్రైవర్లకు మరింత చేరువ చేసేందుకు జర్మన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోష్ 'మైడ్రైవ్అసిస్ట్' పేరిట స్మార్ట్‌ఫోన్ల కోసం ఓ సరికొత్త అప్లికేషన్‌ను విడుదల చేసింది. ఈ అప్లికేషన్ రోడ్డుపై ఉండే సైన్ బోర్డులను గుర్తించి, రోడ్ సైన్స్ మరియు ఇతర సమాచారాన్ని డ్రైవర్లకు తెలియజేస్తుంది.


ఫోన్ కెమరా సాయంతో స్పీడ్ లిమిట్స్, ఇతర డేటాలను ఈ అప్లికేషన్ రీడ్ చేసుకొంటుంది. ఒకవేళ డ్రైవర్ స్పీడ్ లిమిట్ క్రాస్ చేసినట్లయితే, ఈ అప్లికేషన్ డ్రైవర్లను హెచ్చరిస్తుంది. ఇంకా నో ఓవర్‌టేకింగ్ జోన్స్, క్యాన్సిలేషన్ సైన్స్ మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ అప్లికేషన్ తెలియజేస్తుంటుంది.

ఇది కూడా చదవండి: ఫన్నీ రోడ్ సైన్స్

ఈ అప్లికేషన్‌ను యాపిల్ ఐస్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి అప్లికేషన్లు మన రోడ్లపై పనిచేస్తాయా? మన రోడ్ సైన్స్ విషయంలో మనుషులే కన్ఫ్యూజ్ అవుతుంటే, ఇక కెమరాలు అప్లికేషన్లు ఏం పనిచేస్తాయి అంటారా?

ఈ వీడియో చూశారా..? నడిరోడ్డుపై విన్యాసం..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/CA_TTR2PFMU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Saturday, July 19, 2014, 12:22 [IST]
English summary
In our country, we rarely pay heed to road signs. It's understandable, because signage here is a joke. There are no signs for the most part, and even when there are, they are ridiculously placed, confusing, or defy logic. However, this isn't the case in a developed country like Germany.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+