నేడే విడుదల: హ్యుందాయ్ ఎలైట్ ఐ20
ఆగస్ట్ 11, 2014: హ్యుందాయ్ మోటార్ ఇండియా నేడు తమ సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'హ్యుందాయ్ ఎలైట్ ఐ20' (Hyundai Elite i20)ని భారత మార్కెట్లో విడుదల చేయనుంది. న్యూఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్, డిప్లమాటిక్ ఎన్‌క్లేవ్ వద్ద ఉన్న హోటల్ తాజ్ ప్యాలెస్‌లోని దర్బార్ హాలులో ఈ కారును విడుదల చేయనున్నట్లు హోండా మోటార్ ఇండియా పంపిన మీడియా ఆహ్వానంలో పేర్కొంది.
ఈ ఉదయం 11.00 గంటలకు ఈ కారును విడుదల చేయనున్నారు. ఇదే కార్యక్రంలో హ్యుందాయ్ తమ కొత్త ఎలైట్ ఐ20 కారుకు సంబంధించిన ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఇతర వివరాలను వెల్లడించనుంది. కాగా.. హ్యుందాయ్ డీలర్లు ఆగస్ట్ 1, 2014వ తేది నుంచే ఈ కొత్త మోడల్ కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించారు.

ఈ కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారును ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డిజన్ చేశారు. జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద ఈ కారును డిజైన్ చేశారు. ఆగస్ట్ 11న సరికొత్త హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల ప్రస్తుత తరం ఐ20తో పోల్చుకుంటే ఈ కొత్త తరం ఎలైట్ ఐ20 డిజైన్ పూర్తిగా సరికొత్తగా కనిపిస్తుంది.
ఈ కొత్త ఎలైట్ ఐ20 ముందు వైపు కొత్త హ్యుందాయ్ కంపెనీ సిగ్నేచర్ హెక్సాగనల్ గ్రిల్, మందపాటి థిన్ హారిజాంటల్ స్ట్రిప్, వ్రాప్ అరౌండ్ విండో, బూమర్యాంగ్ షేప్డ్ టెయిల్ లైట్స్‌తో ఇది రిఫ్రెష్డ్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలను మరికొద్ది సేపట్లోనే ప్రచురిస్తాము. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








