సెలెరియోలో క్లచ్‌లెస్/ఆటోమేటిక్ మ్యాన్యుల్ గేర్‌బాక్స్
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి త్వరలోనే మరో సరికొత్త కాంపాక్ట్ కారును దేశీయ కస్టమర్లకు పరిచయం చేయనుందని, ప్రస్తుతం మారుతి సుజుకి 'వైఎల్7' (YL7) అనే కోడ్ నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న కాంపాక్ట్ కారుకు 'సెలెరియో' (Celerio) అనే పేరును పెట్టారని, ఫిబ్రవరి 2014లో ఇది భారత మార్కెట్లో ఆవిష్కృతం కానుందని మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే.
తాజా అప్‌డేట్ ప్రకారం, మారుతి సుజుకి సెలెరియో కారులో, భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఓ పర్సనల్ కారులో ఇప్పటివరకు ఉపయోగించని ఓ కొత్త ఫీచర్‌ను ఇందులో ఉపయోగించనున్నారు. అదే 'ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్' (ఏఎమ్‌టి). ఈ టెక్నాలజీ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక క్లచ్ లేని మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్. (టీవీఎస్ జైవ్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన టెక్నాలజీ లాంటిదన్నమాట).

అంటే, ఏఎమ్‌టి ట్రాన్సిమిషన్ కలిగిన మారుతి సుజుకి సెలెరియో కారులో డ్రైవర్ క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకుండా గేరును మ్యాన్యువల్‌గా మార్చాల్సి ఉంటుందన్నమాట. ఈ టెక్నాలజీ వలన రెగ్యులర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లోని సౌకర్యం మరియు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ యొక్క మైలేజ్ రెండూ లభిస్తాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివర్ ఒకరు వెల్లడించారు.
రెగ్యులర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన చిన్న కార్లు మ్యాన్యువల్ వేరియంట్ల కన్నా ఎక్కువ ధరను కలిగి ఉండి, తక్కువ మైలేజీని ఆఫర్ చేస్తుంటాయి. ఉదాహరణకు, ఏ-స్టార్ మ్యాన్యువల్ ధర రూ.3.88 లక్షలుగా ఉంటే, ఏ-స్టార్ ఆటోమేటిక్ ధర రూ.4.77 లక్షలుగా ఉంటోంది. కానీ ఏఎమ్‌టి టెక్నాలజీతో కూడిన మారుతి సెలెరియో సరసమైన ధరను కలిగి ఉండి, మ్యాన్యువల్ వేరియంట్ కన్నా మెరుగైన మైలేజీని ఆఫర్ చేయనుంది.

ఏఎమ్‌టితో కూడిన మారుతి సెలెరియో ధర మ్యాన్యువల్ వేరియంట్ ధర కన్నా నామమాత్రంగా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ ఏఎమ్‌టిలో ఐదు గేర్లు ఉంటాయా లేక నాలుగు గేర్లు ఉంటాయా అనే విషయం మాత్రం తెలియరాలేదు. మారుతి సుజుకి సెలెరియో కారులో పాపులర్ 1.0 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








