రెనొ క్విడ్ యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు

By Anil

ఇప్పుడు భారతదేశం యొక్క యావత్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలల్లో వాడి వేడిగా జరుగుతున్న చర్చ ఏమిటంటే ఈ మధ్యనే విడుదలైన రెనొ క్విడ్ గురించి. ఈ బుల్లి రెనొ క్విడ్ ఇప్పుడు షోరూమ్ లు వదిలి సిటి రోడ్ల మీదకు వచ్చిచేరుతున్నాయి కాబట్టి ఎక్కడ చూసిన దీని గురించే వాదనలు వినిపిస్తున్నాయి. దీని ధర ఎంత, దీనిలో గల ప్రయోజనాలు ఏంటి దీని యొక్క నష్టాలు ఏంటి అని తీవ్రంగా ఆలోచిస్తున్నారా అయితే కాస్త ముందుకు పదండి మీ అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది.
దీనిని కూడా చదవండి: చరిత్రను తిరగరాసిన రెనొ క్విడ్ బుకింగ్స్

రెనొ క్విడ్‌ ఒక ఎంట్రిలెవల్ హ్యాచ్‌బ్యాక్ దీనిని ఫ్రెంచ్ కు చెందిన కార్లతయారి సంస్థ అయిన రెనొ భారత్‌లో సెప్టెంబర్‌ 24న విడుదల చేశారు. రెనొ క్విడ్ యొక్క ప్రారంబ ధర రూ. 2.56 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఎంట్రిలెవల్ హ్యాచ్‍‌బ్యాక్ గా భారత్‌లో తిష్టవేసిన మారుతి సుజుకి ఆల్టో కు గట్టి పోటిని ఇవ్వాలనే లక్ష్యంతో వచ్చినట్లు తెలుస్తోంది.
దీనిని కూడా చదవండి: మారుతి ఆవల్టో 800 ని చంపేసిన రెనొ క్విడ్

దీనిని ప్రయోజనాల మరియు నష్టాలు గురించి ఈ క్రింది స్లయిడర్ ఫోటోల ద్వారా తెలుసుకోండి...

అప్రయోజనాలు

అప్రయోజనాలు

ప్లాస్టిక్ వాడకం :

ఒకరకంగా చూస్తే ఇందులో దాదాపుగా ఎక్కువ ప్లాస్టిక్ వాడినట్లు తెలుస్తోంది. దీని సైడ్ అద్దాలు మరియు కారు తలుపులు లోపలి వైపున కూడా ఎక్కువగా ప్లాస్టిక్ వాడినట్లు అనిపిస్తోంది దీని వలన కారు బరువు చాలా తగ్గిపోయిందని చెప్పవచ్చు దీని పరంగా చూస్తే పెద్దగా శ్రద్ద చూపలేదని అవగతం అవుతోంది.

టాకోమీటర్ లేకపోవడం :

టాకోమీటర్ లేకపోవడం :

టాకో మీటర్ అనగా ఇంజన్ యొక్క ఆర్.పి.యమ్ ని చూపుతుంది. పాత కాలంలో దీనిని పెద్దగా పట్టించుకునే వారుకాదు అయితే ప్రస్తుతం కాలంలో యువత అందరూ దీనిని కోరుకుంటున్నారు. దీని వలన డ్రైవింగ్ మీద మంచి ఇష్టం కలుగుతుంది మరియు డ్రైవ్ చేస్తున్న సమయంలో మంచి అనుభూతి లోనవుతారు. ( అర్.పి.యమ్ అనగా రౌండ్స్ పర్ మినిన్ అంటే ఒక నిమిషంలో ఇంజిన్‌లో గల ఫ్లైవీల్ ఎన్ని చుట్లు తిరిగిందని అర్థం ).

శబ్దం మరియు కుదుపులు :

శబ్దం మరియు కుదుపులు :

శబ్దం రాని కారు కావాలనుకుంటే కొంచెం ఎక్కు డబ్బు వెచ్చించాల్సి వస్తుంది మరియు కుదుపులు అంటారా కారును తక్కువ గేర్లలో నడుపుతున్నప్పుడు కుదుపులు ఉంటాయి తరువాత నిర్ణీత వేగాన్ని అందుకున్న తరువాత ఎలాంటి కుదుపులు ఉండవు.

స్టీరింగ్ వీల్ అడ్జెస్ట్‌మెంట్ :

స్టీరింగ్ వీల్ అడ్జెస్ట్‌మెంట్ :

రెనొ క్విడ్ లో ఉన్న ముఖ్యమైన లోపం స్టీరింగ్ వీల్‌ను అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు లేకపోవడం. కనీసం క్విడ్ యొక్క టాప్ ఎండ్ లెవల్‌లో కూడా ఈ అవకాశం లేదు. మరి పొట్టిగా ఉన్న వ్యక్తులకు ఇది సరిపోకపోవచ్చు.

క్విడ్ యొక్క ప్రయోజనాలు :

క్విడ్ యొక్క ప్రయోజనాలు :

డిజైన్ :

క్విడ్‌‌కి గల ఏకైక పెద్ద అడ్వాంటేజ్ డిజైన్. ఎంట్రిలెవల్ హ్యాచ్ ‌బ్యాక్ లో అత్బుతమైన డిజైన్ గల కారు ఏదంటే రెనొ క్విడ్ ఇప్పటి వరకు ఉన్న అన్నికార్లను ఒక్క సారిగా పక్కకు నెట్టేసిందని చెప్పివచ్చు. దీనికి ముందువైపు గల బోల్డ్ స్టేన్స్ ఎక్కువ ఆకర్షణగా నిలించిందని చెప్పవచ్చు దీనిని రెనొ డస్టర్ ప్రేరణతో డిజైన్ చేశారని సమాచారం ఏదయితేనేం క్విడ్ యొక్క డిజైన్ ఎంతో మంది భారతీయుల మనస్సును దోచేసుకుంది. ఒక సారి మీరు దీనిని చూశారంటే తప్పకుండా ప్రేమిస్తారు.

ఇంటీరియర్ :

ఇంటీరియర్ :

కారు చిన్నదని అనుకుంటున్నారా దీని ఇంటీరియర్ చూశారంటే మీరు ఒక గదిలో అనుభూతిని పొందుతారు, దీని క్యాబిలో గల లెగ్ రూమ్ మరియు హెడ్ రూమ్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. వెనుకవైపు సీటులో ముగ్గురు పెద్దలు కూర్చోవచ్చు అతి తక్కువ బడ్జెలో ఎక్కువ సీటింగ్ కెపాసిటి గల కారు ఇదే మరి. దీని ముందు సీట్లు మనకు సౌకర్యవంతంగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. అయితే వెనుకవైపున గల సీట్లో ముగ్గురితో దూరప్రాంత ప్రయాణాలు అంతసౌకర్యవంతంగా ఉండకపోవచ్చు.

ఇంజిన్ :

ఇంజిన్ :

అందరు ముఖ్యంగా చూసేది ఇంజన్ గురించి. దీనిలో గల 3-సిలిండర్ల ఇంజన్ 53 బి.హెచ్.పి ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ లీటర్ కి 25.17 కిలోమీటర్లు దీనికి ప్రత్యక్ష పోటిగా ఉన్న మారుతి ఆల్టో కన్నా ఇది ఎక్కువ.

కెపాసిటి :

కెపాసిటి :

రెనొ క్విడ్ కేవలం 669 కిలోలు మాత్రమే మోయగలదు అంటే మారుతి కన్నా ఇది తక్కువే. మరియు బరువు పరంగా రెనొ క్విడ్, మారుతి కన్నా 26 కేజిలు తక్కువగా ఉంటుంది.

గ్రౌండ్ క్లియరెన్స్ :

గ్రౌండ్ క్లియరెన్స్ :

రెనొ క్విడ్ అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది దాదాపుగా 180 ఎమ్ఎమ్ అంటే మహీంద్ర బొలెరికి ఉన్నంత. కాబట్టి చిన్న గుంతలు గల రోడ్లమీద వెళుతున్నప్పుడు కారు యొక్క క్రింద భాగం నేలకు తగులుతుందనే భయం లేకుండా మీరు కారును డ్రైవ్ చేయవచ్చు.

మల్టిమీడియా :

మల్టిమీడియా :

మనం చెల్లించే అతి తక్కువ ధరకు ఇందులో మంచి మల్టీమీడియాను కూడా అందించారు.

  • కీ లేస్ ఎంట్రీ
  • నావిగేషన్ గల తాకే తెర
  • పూర్తిగా డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కంన్సోల్
  • పవర్ విండోస్
  • ఆడియో సిస్టమ్ :

    ఆడియో సిస్టమ్ :

    మీరు చదివింది నిజమే ఇందులో 2-డి.ఐ.యన్ ఆడియో సిస్టమ్ మరియు అన్ బోర్డ్ ట్రిప్ కంప్యూటర్ ఉన్నాయి

    వారంటి :

    వారంటి :

    వీటితో పాటు మీకు మంచి వారంటి కూడా ఇస్తున్నారు. 2 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు మరియు దీనిని 3 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్లు, 4 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లుకు పొడిగించారు.

    బూట్ స్పేస్ :

    బూట్ స్పేస్ :

    ఎవరయితే లాంగ్ డ్రైవ్ వెళ్లాలని అనుకుంటారో వారి కోసమే ఈ ప్రయోజనము ఎందుకంటారా దూరప్రాంత ప్రయాణాలలో ఎక్కువ లగేజ్ ను తిసుకెళ్లడామనికి కుదరదు కాని రెనొ క్విడ్ మీకు ఇస్తుంది 300-లీటర్ల లగేజే స్పేస్ మరియు అవసరాన్ని బట్టి దీనిని 1115-లీటర్ల వరకు పెంచుకోవచ్చు. మారుతి ఆల్టోతో పోల్చుకుంటే ఇది ఎంతో ఎక్కువ అందులే కేవలం 177-లీటర్ల బూట్ స్పేస్ మాత్రమే ఉంది.

    భద్రత :

    భద్రత :

    ఎంట్రి లెవల్ హ్యాచ్ బ్యాక్ లలో భద్రతకు రెనొ క్విడ్ పెద్ద పీట వేసిందని చెప్పవచ్చు. కారు చిన్నదైనా భద్రతో కూడిన మంచి సౌకర్యాలు ఇందులో చూడవచ్చు రెనొ క్విడ్‌లో గల టాప్ లెవల్ మోడల్ ఆర్.ఎక్స్.ఇ లో డ్రైవర్ పక్కవైపున ఆప్షనల్ ఎయిర్ బ్యాగ్ అందిచారు. అయితే ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేదు.

    రెనొ క్విడ్ యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు

    2015 రెనొ క్విడ్ యొక్క రేటింగ్స్ :

    తీర్పు :

    తీర్పు :

    గత కొన్ని సంవత్సరాలుగా మంచి ఎంట్రి లెవల్ హ్యాచ్ బ్యాక్ గా కొనసాగుతూ వచ్చిన మారుతి ఆల్టో 800 తో రెనొ క్విడ్‌ని పోల్చగా ఇందులో ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయి అతి తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి రెనొ క్విడ్ ఎంతో ఉత్తమంగా ఉంటుందనేది మా నిర్ణయం మరి మీ నిర్ణయం?

Article Published On: Friday, October 9, 2015, 12:26 [IST]
English summary
One very important topic in the automotive industry at the moment is the Renault Kwid. Being a new kid in town, it has raised a lot of questions and high levels of curiosity. Let's take you for a quick drive, and learn about Renault's all-new Kwid.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+