దేశవ్యాప్తంగా కార్లను అత్యధికంగా ఉపయోగిస్తున్న నగరాలు

By Anil

మన దేశంలో గల వివిద నగరాల ప్రజలు ప్రయాణానికి ఎక్కువగా ఏ వాహనాలను ఉపయోగిస్తున్నారో తెలుసా ?కారు, వ్యాన్ లేదా జీపు అని సమాదానం ఇస్తారు. కాని మీకు తెలుసా సెన్స‌స్ డేటా ప్రకారం దేశ వ్యాప్తంగా రెండు నగరాల ప్రజలు తమ ప్రయాణానికి ఎక్కువగా కార్లను వినియోగిస్తున్నారని తెలిసింది.

అయితే నగరాల వారిగా ఎంత మంది ప్రజలు కార్లను ఎక్కువగా వినియోగిస్తున్నారో మరియు సెన్స‌స్ సేకరించిన మరిన్ని ఆశక్తికరమైన విషయాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందా...

దేశవ్యాప్తంగా కార్లను అత్యధికంగా ఉపయోగిస్తున్న నగరాలు

2011 సంవత్సకరం సెన్సస్ లెక్కల ప్రకారం అత్యధికంగా ఢిల్లీ ప్రజలు 10.78 శాతం కార్లలో ప్రయాణం చేస్తున్నారు. రవాణా మంత్రిత్వ శాఖ వారి లెక్కల ప్రకారం డిల్లీలో అత్యధిక కార్లను వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీలో అత్యధిక కార్లు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా కార్లను అత్యధికంగా ఉపయోగిస్తున్న నగరాలు

ఢిల్లీ మెట్రో నగరంలో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు దాదాపుగా లక్ష మంది ప్రజలు మెట్రో ట్రైన్‌లోల ప్రయాణిస్తున్నారు. అయినప్పటికి ఎక్కువ కార్లను వినియోగిస్తున్న నగరాలలో ఢిల్లీ ముందు. ఎంతయినా ఇది మన రాజధాని నగరం కదా.

దేశవ్యాప్తంగా కార్లను అత్యధికంగా ఉపయోగిస్తున్న నగరాలు

దిలీప్ సింగ్(49), ఢిల్లీలో ఒక ప్రయివేట్ సంస్థలో జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, ప్రతి రోజు ఉదయం మరియు సాయంకాలంలో గల జనాభా రవాణాకు మెట్రో ఏ మాత్రం సరిపోవడం లేదని వివరించాడు. మరియు కార్లలో ప్రయాణం స్టేటస్ కు గుర్తుగా భావించి ఎక్కువ మంది కార్లను ఆశ్రయిస్తున్నారని తెలిపాడు.

దేశవ్యాప్తంగా కార్లను అత్యధికంగా ఉపయోగిస్తున్న నగరాలు

రెండవ స్థానంలో చెన్నై 6.41 శాతం ప్రజలు కార్ల ప్రయాణానికి బానిసలైపోయారని వెల్లడించారు. ఇది ఎవరూ నమ్మలేరు కాని ఇది నిజం.

దేశవ్యాప్తంగా కార్లను అత్యధికంగా ఉపయోగిస్తున్న నగరాలు

రాజీవ్ బలరామ్(26) ఇతను ఐటి విభాగంలో పని చేస్తున్నాడు. చెన్నైలో వివిద ప్రాంతాల నుండి మెట్రో ట్రైన్‌లో ప్రయాణం చేసినప్పటికి ఆ తరువాత ప్రయాణానికి కార్లన ఆశ్రయించాల్సి వస్తోంది అని తెలిపాడు. బహుశా ఇందుకే కాబోలు చెన్నై రెండవ స్థానంలో ఉంది.

దేశవ్యాప్తంగా కార్లను అత్యధికంగా ఉపయోగిస్తున్న నగరాలు

మూడవ స్థానంలో ముంబై. దేశ వ్యాప్తంగా తమ అన్ని అవసరాలకు కార్లను వినియోగిస్తున్న నగరాలలో ముంబై మూడవ స్థానంలో ఉంది. దాదాపుగా 4.78 శాతం ప్రజలు తమ రోజు వారి వినియోగానికి కార్లను వినియోగిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కార్లను అత్యధికంగా ఉపయోగిస్తున్న నగరాలు

కలకత్తా నగరంలో తమ రోజు వారి ప్రయాణ అవసరాలకి 2.93 శాతం ప్రజలు కార్లను వినియోగిస్తున్నారు. అయితే ఢిల్లీతో పోల్చితే కలకత్తా నగరం రోజుకు 35 లక్షల వరకు ప్రయాణికులను తమ ప్రాంతాలకు చేరవెస్తున్నట్లు తెలిసింది.

దేశవ్యాప్తంగా కార్లను అత్యధికంగా ఉపయోగిస్తున్న నగరాలు

ఇక మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి సమస్య ఇంకా రాలేదు అని తెలుసుకోవచ్చు. ఒక వేళ అత్యధిక కార్లు మన నగరాలలో కూడా ఉన్నాయి అని మీరు అనుకుంటే. ఇక సెన్సస్ లెక్కల ప్రకారం మొదటి నాలుగు రాష్ట్రాల వారి పరిస్థితి ఎంటో తెలుసుకోండి

పార్కింగ్ ఫీజులతో హడలెత్తిపోతున్న ఢిల్లీ నగర వాసులు...

Article Published On: Friday, November 13, 2015, 19:31 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+