పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించిన షెవర్లే ఇండియా
పడుగ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో షెవర్లే ఇండియా వివిద రకాల డీల్స్ మరియు ఆఫర్లను ప్రకటించింది. 2015 సంవత్సరపు పండుగ సీజన్ కోసం ఇప్పటికే చాల కార్ల కంపెనీలు ఆఫర్లను ప్రకటించాయి. అయితే వాటితో పాటుగా షెవర్లేవివిధ రకాల డీల్స్‌ను ప్రకటించింది.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: ఫెరారి యఫ్12 బెర్లినెట్టా స్పెషల్ ఎడిషన్ పరిచయం.
షెవర్లే కార్ల ఉత్పత్తులను అక్టోబర్ 31 వ తేదిలోపు బుక్ చేసుకున్న వారు ఈ డీల్స్ మరియు ఆఫర్లను పొందుటకు అర్షులని తెలిపారు. షెవర్లే మోడళ్ళు అయిన బీట్, సెయిల్, ఎంజాయ్ మరియు క్రూజ్ వంటి కార్ల మీద ఈ ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: రెనొ క్విడ్ మరియు హ్యుందాయ్ ఇయాన్‌ల మధ్య పెరిగిన పోటి.
షెవర్లే కార్లకు సంభందించి అన్ని ఆఫర్లను క్రింది కథనాల తెలుసుకుందాం....

షెవర్లే బీట్ :
అమెరికా ఆధారిత ఆటోమొబైల్ తయారిదారులైన షెవర్లే కంపెని వారు షెవర్లే కార్ల మీద 3+2 సంవత్సరాల వారంటి అందిస్తున్నారు. అంతే కాకుండా ఒక సంవత్సరం ఉచిత ఇన్సూరెన్స్ మరియు మూడు సంవత్సరాల ఉచిత మెయింటెనెన్స్‌ను అందిస్తున్నారు.

షెవర్లే సెయిల్ :
షెవర్లే తన కాంపాక్ట్ సెడాన్‌లకు కూడా మూడు సంవత్సరాల ఉచిత మెయింటెనెన్స్ ప్యాకేజిని అందిస్తోంది. మరియు ఈ పండుగ సీజన్ సంధర్భంగా సెయిల్ మీద షెవర్లే మొత్తం ఐదు సంవత్సరాల వారంటిని కల్పించింది.

షెవర్లే ఎంజాయ్ :
షెవర్లేకు చెందిన ఎమ్‌పివి కారు ఎంజాయ్. దీని మీద వినియోగదారులకు కేవలం ఒక లాభం మాత్రమే కల్పించింది. అది ఐదు సంవత్సరాల వారంటి.

షెవర్లే క్రూజ్ :
షెవర్లే ఈ సారి క్రూజ్ సెడాన్‌ను ఎంచుకునే వినియోగదారులను ఆనందపరిచింది ఎందుకంటే. క్రూజ్ నుండి మీరు పొందవచ్చు ఒక సంవత్సరం ఉచిత ఇన్సురెన్స్, మూడు సంవత్సరాల మెయింటెనెన్స్ ప్యాకేజి, ఐదు సంవత్సరాల వారంటి మరియు ఎంపిక చేసుకోదగిన వడ్డి రేటు 9.9 గా ఉంది.

కొత్త మోడల్ :
షెవర్లే నుండి కొత్త మోడల్ అయిన ట్రయల్‌బ్లేజర్ యస్.యు.వి కారును ఇండియాలో ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉంది. అయితే దీనిని ఈ నెలలోనే ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఆఫర్లు గల మోడల్స్ :
షెవర్లే ప్రస్తుతానికి ఇండియాలో స్పార్క్, బీట్, సెయిల్ హ్యాచ్‌బ్యాక్, సెయిల్, ఎంజాయ్, క్రూజ్, క్యాప్టివా, తవేరా మోడల్స్ మీద ఆఫర్లును ప్రకటించింది.


Click it and Unblock the Notifications








