ఉత్పత్తికి సిద్దమైన డాట్సన్ రెడి గో
డాట్సన్ ఇండియా కు చెందిన ఎంట్రీ లెవల్ కారు రెడి గో ఉత్పత్తికి సిద్దమైంది. ఇది మారుతి సుజుకి ఆల్టో మరియు రెనో వారి క్విడ్ కారుకు పోటిగా మార్కెట్లోకి రానుంది. అయితే దీనిని చెన్నైలోని రహదారుల మీద ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండగా ఇలా మీడియా దృష్టిలో పడింది.
డాట్సన్ రెడి గో గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

రెడి గో కారును డాట్సన్ వారు 2014లో ఢిల్లీ లో జరిగిన ఆటో ఎక్స్-పోలో ప్రదర్సించారు. అయితే అప్పటికి డిజైన కన్నా ఇందులో స్వల్పంగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా డిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, లైట్లు మరియు టెయిల్ ల్యాంప్స్ ఎంతో అందంగా రూపొందించారు.

ఇది 800సీసీ కెపాసిటి మరియు మ్యాన్యువల్, అటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

డాట్సన్ రెడి గో మార్కెట్లోకి విడుదల అయితే మారుతి సుజుకి ఆల్టో 800, హ్యుందాయ్ ఇయాన్ మరియు రెనో వారి క్విడ్ కార్లకు పోటిగా నిలువనుంది.

రెడి-గో మార్కెట్లోకి విడుదల అయితే ధర దాదాపుగా 3 లక్షల రుపాయల వరకు ఉండనుంది.

- 2016 నుండి స్వల్పంగా ధరలు పెంచనున్న నిస్సాన్ మరియు డాట్సన్
- బ్రెజిల్లో అగ్ని పరీక్షకు సిద్దమైన హోండా జాజ్ ట్విస్ట్ క్రాసోవర్: అతి త్వరలో ఇండియాకు.


Click it and Unblock the Notifications








